మూడో టెస్టుకు ముందే ఇంగ్లండ్ జట్టు భార‌త్‌ను ఎందుకు వదిలి వెళ్తుంది..? అసలు కారణం ఇదే..

మూడో టెస్టు మ్యాచ్ ఈనెల 15న రాజ్ కోట్ లో ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ జట్టు భారతదేశాన్ని వీడి వెళ్లిపోనుంది.

మూడో టెస్టుకు ముందే ఇంగ్లండ్ జట్టు భార‌త్‌ను ఎందుకు వదిలి వెళ్తుంది..? అసలు కారణం ఇదే..

England Team

IND vs ENG Test Series 2024: ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా రెండు టెస్టులు మ్యాచ్ లు పూర్తయ్యాయి. హైదరాబాద్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ జట్టు విజయం సాధించింది. విశాఖలో జరిగిన రెండో టెస్టులో భారత్ విజయం సాధించింది. దీంతో సిరీస్ లో రెండు మ్యాచ్ లలో 1-1తో ఇరు జట్లు సమఉజ్జీలుగా ఉన్నాయి. మూడో టెస్టు మ్యాచ్ ఈనెల 15న రాజ్ కోట్ లో ప్రారంభం కానుంది. అయితే, ఈ మ్యాచ్ కు ముందు ఇంగ్లండ్ జట్టు భారతదేశాన్ని వీడివెళ్లిపోయింది.

Also Read : ప్రతీకారం తీర్చుకున్న భారత్.. ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం

ఇండియా – ఇంగ్లండ్ మూడో టెస్టు మ్యాచ్ కు ఇంకా పది రోజుల సమయం ఉంది. దీంతో ఇంగ్లండ్ జట్టు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కి వెళ్లడానికి సిద్ధమైంది. మూడో టెస్టు మ్యాచ్ కు కొద్దిరోజుల ముందు జట్టు తిరిగి ఇండియాకు వస్తుంది. అబుదాబిలోనే కండిషనింగ్ క్యాంప్ తో ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కు సిద్ధమైంది. బెన్ స్ట్రోక్స్ అండ్ కో ప్రాక్టీస్ మ్యాచ్ లకోసం భారత్ కు చేరుకోవటానికి బదులు అబుదాబీ వెళ్లారు. అక్కడ ప్రాక్టీస్ లో భారత్ స్పిన్నర్లను ఎదుర్కోవడంపై ప్రాక్టీస్ చేశారు. ఆ తరువాత హైదరాబాద్ వేదికగా సిరీస్ లో తొలి టెస్టు ఆడేందుకు వచ్చారు. తాజాగా.. మూడో టెస్టుకు సుమారు పది రోజుల సమయం ఉండటంతో అబుదాబిలో శిక్షణ శిబిరంకు ఇంగ్లండ్ ప్లేయర్స్ వెళ్లనున్నారు. ఇంగ్లండ్ జట్టు బుధవారం అబుదాబికి వెళ్తుంది. రాజ్ కోట్ టెస్టు మ్యాచ్ కు మూడు రోజుల ముందు తిరిగి ఇండియాకు చేరుకుంటుంది.

Also Read : శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్.. బెన్ స్టోక్స్ రనౌట్