శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్.. బెన్ స్టోక్స్ రనౌట్
శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్‌తో విశాఖపట్నం టెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రనౌటయ్యాడు.

Benstokes run out very good fielding from Shreyas Iyer
Benstokes run out: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ రనౌటయ్యాడు. శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్ కారణంగా బెన్ స్టోక్స్ పెలియన్ చేరాడు. అశ్విన్ బౌలింగ్ లో స్క్వేర్ లెగ్ సైడ్ కొట్టిన బంతిని అయ్యర్ వేగంగా అందిపుచ్చుకుని డైరెక్ట్ త్రో చేయడంతో బెన్ స్టోక్స్ రనౌటయ్యాడు. కీలక సమయంలో బెన్ స్టోక్స్ అవుట్ కావడంతో టీమిండియా ఆటగాళ్లుతో పాటు మైదానంలోని ప్రేక్షకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. బెన్ స్టోక్స్ ఎంత కీలమైన ఆటగాడో అందరికీ తెలుసు. ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల సత్తా ఉన్న ప్లేయర్ అతడు. కాగా, బెన్ స్టోక్స్ ను రనౌట్ చేసి శ్రేయస్ అయ్యర్ ప్రతీకారం తీర్చుకున్నాడని సోషల్ మీడియాలో నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
194 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు బెన్ స్టోక్స్. అయితే శ్రేయస్ అయ్యర్ అద్భుత ఫీల్డింగ్‌తో 7వ వికెట్ గా పెవిలియన్ చేరాడు. బెన్ స్టోక్స్ అవుటయ్యే సమయానికి ఇంగ్లండ్ 220 పరుగులు చేసింది. మరో వికెట్లు పడగొడితే విజయం భారత్ సొంతమవుతుంది. హైదరాబాద్‌లో జరిగిన మొదటి టెస్ట్ లో పరాజయం పాలైన టీమిండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో ఉంది. డ్రింక్స్ విరామ సమయానికి ఇంగ్లీషు టీమ్ 7 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
Also Read: 8వ పెళ్లిరోజున భార్య ఫేస్ రివీల్ చేసిన క్రికెటర్
? Shreyas goes ?????? with a stunning direct hit to get rid of the dangerous Stokes ?#BazBowled #IDFCFirstBankTestsSeries #JioCinemaSports#INDvENG pic.twitter.com/SNrchCWtsF
— JioCinema (@JioCinema) February 5, 2024
Hahahahaha. Tit for tat ???
Shreyas Iyer took his revenge?#INDvENG #INDvsENGTest #INDvsENG
Stokes after Shreyas after
shreyas catch Stokes run out pic.twitter.com/unyv44qVG0— RanaJi? (@RanaTells) February 5, 2024