Kane Williamson : వ‌చ్చాడు.. ఒక్క మ్యాచులో రెండు రికార్డులు.. కేన్ మామ‌తో మామూలుగా ఉండ‌దు

న్యూజిలాండ్ సార‌థి కేన్ విలియమ్సన్ వ‌చ్చి రాగానే అరుదైన ఘ‌న‌త సాధించాడు. న్యూజిలాండ్ త‌రుపున అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త‌ సాధించిన మొద‌టి ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు.

Kane Williamson

Kane Williamson runs : న్యూజిలాండ్ సార‌థి కేన్ విలియమ్సన్ వ‌చ్చి రాగానే అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్‌లో గాయ‌ప‌డ‌డంతో చాలా కాలం ఆట‌కు దూరంగా ఉన్న కేన్ మామ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో రీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే.. ఆ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తుండ‌గా అత‌డి చేతికి గాయం కావ‌డంతో ఆట‌కు మ‌ళ్లీ దూరం అయ్యాడు. గాయం నుంచి కోలుకోవ‌డంతో శ‌నివారం పాకిస్థాన్‌తో జ‌రుగుతున్న కీల‌క మ్యాచ్‌కు అందుబాటులోకి వ‌చ్చాడు.

ఓపెన‌ర్ డెవాన్ కాన్వే ఔటైన త‌రువాత వ‌న్‌డౌన్‌లో విలియ‌మ్సన్ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. ఇన్నింగ్స్‌ పద్నాలుగో ఓవర్ ను హ్యారిస్ ర‌వూఫ్ వేశాడు. మొద‌టి బంతికి సింగిల్ తీసిన విలియ‌మ్స‌న్ వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లో 1000 ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. న్యూజిలాండ్ త‌రుపున అత్యంత వేగంగా ఈ ఘ‌న‌త‌ సాధించిన మొద‌టి ఆట‌గాడిగా చరిత్ర సృష్టించాడు. 24 ఇన్నింగ్స్‌ల్లోనే కేన్ ఈ ఫీట్‌ను అందుకున్నాడు.

Hardik Pandya : వరల్డ్ కప్ నుంచి తప్పుకున్న తరువాత హార్దిక్ పాండ్యా భావోద్వేగ ట్వీట్.. ఏమన్నాడంటే

ఓవ‌రాల్‌గా.. ప్ర‌పంచ‌క‌ప్‌ల‌లో వెయ్యి ప‌రుగులు వేగంగా అందుకున్న జాబితాలో కేన్ మామ ఆరో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో ఆస్ట్రేలియా ఆటగాడు డేవిడ్ వార్న‌ర్‌, టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌లు సంయుక్తంగా అగ్ర‌స్థానంలో ఉన్నారు. వీరిద్ద‌రు 19 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘ‌న‌తను సాధించారు. ఆ త‌రువాత స‌చిన్‌, డివిలియ‌ర్స్ 20 ఇన్నింగ్స్‌ల్లో, వివ్ రిచ‌ర్డ్స్‌, సౌర‌వ్ గంగూలీలు 21 ఇన్నింగ్స్‌ల్లో , మార్క్‌వా, హెర్ష‌ల్ గిబ్స్ 22 ఇన్నింగ్స్‌ల్లో, దిల్షాన్ 23 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త‌ను సాధించారు.

అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో కేన్ విలియ‌మ్సన్ మ‌రో రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. న్యూజిలాండ్ త‌రుపున వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా నిలిచాడు. పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కేన్ మామ 79 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 95 ప‌రుగులు చేశాడు. ఈ క్ర‌మంలో దిగ్గ‌జ ఆట‌గాడు స్టీఫెన్ ప్లెమింగ్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. 1075 ప‌రుగుల‌తో ప్లెమింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు అగ్ర‌స్థానంలో ఉండ‌గా తాజాగా కేన్ మామ 1084 ప‌రుగుల‌తో మొద‌టి స్థానానికి చేరుకున్నాడు.

Sri Lanka Cricket: మరీ ఇంత చెత్తాటా..! ఆ ఓటములకు కారణమేమిటో వివరణ ఇవ్వండి

ట్రెండింగ్ వార్తలు