తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి.. గ్రౌండ్‌లోనే

సౌత్ జోన్ టోర్న్ మెంట్ లో తమిళనాడుతో మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది.

తీవ్ర విషాదం.. గుండెపోటుతో యువ క్రికెటర్ మృతి.. గ్రౌండ్‌లోనే

Karnataka Cricketer Dies Of Cardiac Arrest

Karnataka Cricketer Dies : గుండెపోటు మరణాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. సడెన్ గా గుండెపోటుతో చనిపోతున్నారు. ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వారు, ఎంతో హెల్తీగా ఉన్న వారు సైతం హార్ట్ ఎటాక్ తో చనిపోతుండటం ఆందోళన కలిగించే అంశం. యువకులు, క్రీడాకారులు సైతం గుండెపోటుతో చనిపోతున్నారు. తాజాగా గుండెపోటు యువ క్రికెటర్ ను బలి తీసుకుంది.

కర్నాటక క్రికెట్ లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గుండెపోటుతో యువ క్రికెటర్ హోయ్‍సల మృతి చెందాడు. అతడి వయసు 34ఏళ్లు. బెంగళూరులోని ఆర్ఎస్ ఐ గ్రౌండ్ లో ఏఈజీ సౌత్ జోన్ టోర్న్ మెంట్ లో (ఏజిస్) తమిళనాడుతో మ్యాచ్ జరిగింది. ఈ సమయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. కర్నాటక ప్లేయర్ హోయ్ సల ఒక్కసారిగా కుప్పకూలి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, అప్పటికే అతడు గుండెపోటుతో చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. హోయ్ సల కర్నాటక ప్రీమియర్ లీగ్(KPL) లో కూడా ఆడాడు.

మ్యాచ్ అనంతరం హోయ్ సల తన టీమ్ తో కలిసి డిన్నర్ చేసేందుకు వెళ్తున్నాడు. సడెన్ గా గ్రౌండ్ లోనే కుప్పకూలాడు. వెంటనే సహచరులు అతడికి సీపీఆర్ చేశారు. కానీ, ప్రయోజనం లేకపోయింది. అతడు చనిపోయాడు. హోయ్ సల అండర్ 25 కేటగిరీలో కర్నాటకకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. హోయ్ సల మృతితో జట్టులో తీవ్ర విషాదం అలముకుంది. అతడిక లేడు అనే వార్తను సహచరులు జీర్ణించుకోలేకపోతున్నారు. హోయ్ సల టాలెంటెడ్ ప్లేయర్, మంచి క్రికెటర్ ను కోల్పోయామని సహచరులు కన్నీటి పర్యంతం అయ్యారు. హోయ్ సల బౌలర్ మాత్రమే కాదు బ్యాట్స్ మెన్ కూడా అని చెప్పారు. మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేసేవాడని తెలిపారు.

Also Read : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2024.. ఈ విషయాలు మీకు తెలుసా?