Kavya Maran : ఎస్ఆర్‌హెచ్‌ ఓటమి తరువాత కావ్య మారన్ ప‌వ‌ర్‌ఫుల్‌ స్పీచ్.. నెటిజన్ల ప్రశంసల జల్లు

ఓటమి తరువాత తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్ల వద్దకు కావ్య మారన్ వెళ్లారు. వారిని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kavya Maran In SRH Dressing Room : ఐపీఎల్ 2024 ఫైనల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఊహించని ఓటమి ఎదురైంది. మ్యాచ్ ప్రారంభం నుంచి కోల్ కతా నైట్ రైడర్స్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జట్టు ఓటమితో ఎస్ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆ జట్టు సహ యాజమాని కావ్య మారన్ సైతం జట్టు ఓటమి తరువాత స్టేడియంలోనే కన్నీరు పెట్టుకున్నారు. ఓటమితో తీవ్ర నిరాశకు గురైన ఆటగాళ్లు మైదానంవీడి నేరుగా డ్రెస్సింగ్ రూంకు వెళ్లారు.

Also Read : టీ20 ప్ర‌పంచ‌క‌ప్ వార్మ‌ప్ మ్యాచ్‌లు.. భార‌త్ వ‌ర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌ను ఎక్క‌డ చూడొచ్చో తెలుసా?

ఓటమి తరువాత తీవ్ర నిరాశతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్ల వద్దకు కావ్య మారన్ వెళ్లారు. వారిని ఓదార్చారు. ఓటమితో బాధపడాల్సిన అవసరం లేదు. ఈ సీజన్ లో మన ఆటతీరు అద్భుతమని ఆటగాళ్లలో నిరుత్సాహాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ఈరోజు చాలా బ్యాడ్ డే. కానీ, ఈ సీజన్లో మీరందరూ బ్యాట్, బాల్ తో బాగా రాణించారు. మీ అద్భుత ప్రతిభతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఎస్ఆర్ హెచ్ కు మద్దతుగా నిలిచారు. మీరందరూ మమ్మల్ని చాలా గర్వపడేలా చేశారు. ఫైనల్లో కోల్ కతా విజయం సాధించినప్పటికీ ఈ సీజన్ లో ఎస్ఆర్ హెచ్ అద్భుత ఆటతీరు గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అందరికీ ధన్యవాదాలు అంటూ కావ్య మారన్ నిరాశతో ఉన్న ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపారు.

Also Read : KKR Celebrations : మూడోసారి ఐపీఎల్ ట్రోఫీ.. డ్రెస్సింగ్ రూమ్‌లో కోల్‌క‌తా ఆట‌గాళ్ల సెల‌బ్రెష‌న్స్ చూశారా..?

కావ్య మారన్ జట్టు ఆటగాళ్లతో మాట్లాడిన వీడియోను సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. కావ్య మారన్ జట్టు ఆటగాళ్లతో మాట్లాడిన తీరు, ఓటమితో బాధలో ఉన్నప్పటికీ.. నిరాశతో డ్రెస్సింగ్ రూంలో ఉన్న ఆటగాళ్లను తన పవర్ ఫుల్ స్పీచ్ తో ఉత్సాహపర్చిన తీరును చూసిన నెటిజన్లు ఆమెపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఐపీఎల్ ప్రాంచైజీల్లో బెస్ట్ ఓనర్ కావ్య మారన్ అంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు