Ranji Trophy, KER vs GUJ
Gujarat Vs Kerala: రంజీట్రోఫీ 2024-25లో భాగంగా కేరళ, గుజరాత్ జట్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధించినా ఫైనల్స్ కు చేరుకుంటుంది. అయితే, మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగుతున్నవేళ ‘హెల్మెట్’ గుజరాత్ జట్టు ఫైనల్ ఆశలను దెబ్బతీసింది. తద్వారా కేరళ జట్టు ఫైనల్ లోకి దూసుకెళ్లింది. అయితే, 1957లో తొలి రంజీ మ్యాచ్ ఆడిన కేళర జట్టు 68ఏళ్లలో తొలిసారి రంజీ ట్రోఫీ ఫైనల్స్ కు దూసుకెళ్లింది. దీంతో కేరళ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్ని తాకాయి.
429/7 వద్ద ఐదోరోజు ఆట ఆరంభించిన గుజరాత్ మరో 29 పరుగులు (కేరళ తొలి ఇన్నింగ్స్ స్కోర్ 457) చేస్తే ఫైనల్ కు దూసుకెళ్తుంది. కానీ, కేరళ ఎడమచేతి వాటం స్పిన్నర్ ఆధిత్య సర్వాటే అద్భుతం చేశాడు. ఓవర్ నైట్ బ్యాటర్లు సిద్ధార్థ్ దేశాయ్ (30), జమ్ మీత్ పటేల్ (79)ను ఔట్ చేసిన అతడు.. 455 పరుగుల వద్ద నగ్వాస్ వాలా (10)ను బోల్తా కొట్టించడంతో గుజరాత్ ఫైనల్ అవకాశాన్ని చేజార్చుకుంది.
Also Read: Sourav Ganguly : ‘గంగూలీ’ బయోపిక్ వచ్చేస్తుంది.. గంగూలీ పాత్రలో నటించే స్టార్ హీరో ఎవరో తెలుసా?
కొంపముంచిన హెల్మెంట్..
ఓపిగ్గా ఆడుతూ వచ్చిన గుజరాత్ బ్యాటర్ అర్జాన్ నగ్వాస్ వాలా 48 బంతుల్లో 10 పరుగులు చేశాడు. కేరళ ఫైనల్ కు చేరాలంటే ఒక్క వికెట్ కావాలి. గుజరాత్ ఫైనల్ కు చేరాలంటే రెండు పరుగులు చేయాలి. ఈ క్రమంలో ఒక్క షాట్ తో మ్యాచ్ ను ముగించేద్దామని అనుకున్నట్లుగా నగ్వాస్ వాలా గట్టిగా ఓ షాట్ కొట్టాడు. గాల్లో లేచిన బంతి షార్ట్ లెగ్ లో ఫీల్డింగ్ చేస్తున్న సల్మాన్ నిజార్ హెల్మెట్ ను బలంగాతాకి పైకి ఎగిరింది. పక్కనే మొదటి స్లిప్ లో ఉన్న కేరళ కెప్టెన్ సచిన్ బేబి ఆ బంతిని అందుకున్నాడు. దీంతో నగ్వాస్ వాలా ఔట్ కావటంతో గుజరాత్ జట్టు ఆలౌట్ అయింది. ఫలితంగా డ్రాగా ముగిసిన సెమీఫైనల్లో రెండు పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా కేరళ జట్టు ఫైనల్ కు చేరింది. బంతి హెల్మెంట్ ను తగిలి గాల్లోకి లేవడం.. ఆ బంతిని సచిన్ బేబి పట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
1⃣ wicket in hand
2⃣ runs to equal scores
3⃣ runs to secure a crucial First-Innings LeadJoy. Despair. Emotions. Absolute Drama! 😮
Scorecard ▶️ https://t.co/kisimA9o9w#RanjiTrophy | @IDFCFIRSTBank | #GUJvKER | #SF1 pic.twitter.com/LgTkVfRH7q
— BCCI Domestic (@BCCIdomestic) February 21, 2025
ఈ మ్యాచ్ లో కేరళ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 457 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు 455 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన కేళర జట్టు నాలుగు వికెట్లకు 114 పరుగులు చేసింది. అయితే, కేరళ – గుజరాత్ మ్యాచ్ లో రిజల్ట్ రావడం అసాధ్యంగా మారడంతో రూల్స్ కీలకంగా మారాయి. రంజీల్లో మ్యాచ్ డ్రాగా ముగిసిన పక్షంలో మొదటి ఇన్నింగ్స్ లో లీడ్ సాధించిన టీమ్ ను విన్నర్ గా అనౌన్స్ చేస్తారు. తాజా మ్యాచ్ లో ఫలితం కష్టమవడంతో ఫస్ట్ ఇన్నింగ్స్ లో రెండు పరుగులతో ఆధిక్యంలో ఉన్న కేరళ జట్టును విజేతగా ప్రకటించారు.
ఐసీసీ నియమాల ప్రకారం.. బంతి ఫీల్డర్ హెల్మెంట్ కు తగిలి అదే అటగాడు దానిని పట్టుకుంటే క్యాచ్ గా పరిగణించరు. అయితే.. మరో ఆటగాడు దానిని పట్టుకుంటే ఔట్ గా పరిగణిస్తారు.