Cricket World Cup : క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులు…ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు

క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులపై గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్‌ 5వతేదీన జరగనున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ను వరల్డ్‌ టెర్రర్‌ కప్‌గా మారుస్తామని బెదిరించిన నిషేధిత సిక్కుల ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్‌వంత్‌ సింగ్‌ పన్నూన్‌పై గుజరాత్‌ పోలీసులు కేసు నమోదు చేశారు....

Khalistani Terrorist Gurpatwant Pannun

Cricket World Cup : క్రికెట్ ప్రపంచకప్‌కు బెదిరింపులపై గుజరాత్ పోలీసులు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూన్‌పై కేసు నమోదు చేశారు. అహ్మదాబాద్ నగరంలోని నరేంద్ర మోదీ స్టేడియంలో అక్టోబర్‌ 5వతేదీన జరగనున్న క్రికెట్‌ ప్రపంచకప్‌ను వరల్డ్‌ టెర్రర్‌ కప్‌గా మారుస్తామని బెదిరించిన నిషేధిత సిక్కుల ఫర్‌ జస్టిస్‌ (ఎస్‌ఎఫ్‌జే) చీఫ్‌ గురుపత్‌వంత్‌ సింగ్‌ పన్నూన్‌పై గుజరాత్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. (Khalistani Terrorist Gurpatwant Pannun Booked By Gujarat Police) ఓ విదేశీ నంబర్ నుంచి పంపిన ప్రీ-రికార్డ్ వాయిస్ మెసేజ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వ్యక్తులను ఉగ్రవాది పన్నూన్ బెదిరించినట్లు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు పేర్కొన్నారు.

Heavy Rains : నీటమునిగిన న్యూయార్క్ నగరం..ఎమర్జెన్సీ ప్రకటన

చాలా మందికి ఫోన్ నంబర్ +447418343648 నుంచి ముందస్తుగా రికార్డ్ చేసిన బెదిరింపు వాయిస్ మెసేజ్ వచ్చిందని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్‌స్పెక్టర్ హెచ్‌ఎన్ ప్రజాపతి దాఖలు చేసిన ఫిర్యాదులో తెలిపారు. (Threat To Cricket World Cup) బెదిరింపు సందేశాన్ని అందుకున్న వారు వివిధ మాధ్యమాల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

Trains Collide : స్కాట్లాండ్‌లో రెండు రైళ్ల ఢీ…పలువురికి గాయాలు

మొబైల్ ఫోన్ వినియోగదారు కాల్ అందుకున్న తర్వాత ప్లే అయ్యే ప్రీ-రికార్డ్ చేసిన సందేశంలో అక్టోబర్ 5 క్రికెట్ ప్రపంచ కప్ ప్రారంభం కాదని, వరల్డ్ టెర్రర్ కప్ ప్రారంభం కానుందని పేర్కొంది. సిక్కులు న్యాయం కోసం అహ్మదాబాద్‌ను ముట్టడించబోతున్నారు. ఖలిస్థానీ జెండాలతో అని అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ జితు యాదవ్ ఎఫ్‌ఐఆర్‌ను ఉటంకిస్తూ తెలిపారు.

Congress Manifesto : వారందరికీ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కీలక నిర్ణయం

‘‘షహీద్ నిజ్జర్ హత్యకు ప్రతీకారం తీర్చుకోబోతున్నాం. మీ బుల్లెట్లకు వ్యతిరేకంగా బ్యాలెట్లను ప్రయోగించబోతున్నాం. మీ హింసకు వ్యతిరేకంగా ఓటు వేయబోతున్నాం. అక్టోబర్ 5వతేదీ గుర్తుంచుకోండి అని గురుపత్వంత్ సింగ్ పన్నూన్ నుంచి సందేశం వచ్చింది. గురుపత్వంత్ సింగ్ పన్నూన్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈయన విదేశాల నుంచి సిక్కుల కోసం జస్టిస్ అనే సంస్థను నడుపుతున్నాడు.

Bihar Politics: ఇండియా కూటమికి చెక్ పెడతారా? నితీశ్ కుమార్, లాలూ ప్రసాద్ ప్లానేంటి?

ఈ వాయిస్ సందేశాన్ని వ్యాప్తి చేసిన పన్నూన్, అతని అజ్ఞాత సహచరులపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 121-ఏ, 153 బి, ఐటీ, ఉపా చట్టాల కింద కేసు నమోదు చేశామని అహ్మదాబాద్ ఏసీపీ యాదవ్ చెప్పారు. సైబర్ క్రైమ్ బ్రాంచ్ దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ఏడుగురిని సిమ్‌బాక్స్ అనే పరికరాన్ని ఉపయోగించి బల్క్‌లో ఇటువంటి ప్రీ-రికార్డ్ సందేశాలను పంపారని దర్యాప్తులో తేలింది.

ట్రెండింగ్ వార్తలు