Congress Manifesto : వారందరికీ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కీలక నిర్ణయం

మరికొన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా మరిన్ని పథకాల రూపకల్పన చేయనుంది. Telangana Congress Manifesto

Congress Manifesto : వారందరికీ ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం.. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కీలక నిర్ణయం

Telangana Congress Manifesto (Photo : Google)

Telangana Congress Manifesto : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈసారి ఎలాగైనా అధికారం దక్కించుకోవాలని కాంగ్రెస్ పట్టుదలగా ఉంది. ఇందులో భాగంగా ప్రజాకర్షక పథకాలతో మేనిఫెస్టో రూపకల్పన చేస్తోంది. ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీమ్ లు అనౌన్స్ చేసింది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఏం చేస్తుందో ఆ పార్టీ నాయకులు చెప్పారు.

కర్నాటకలో 5 గ్యారెంటీ స్కీమ్ లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఈ 6 గ్యారెంటీ స్కీమ్స్ తో కచ్చితంగా తెలంగాణలోనూ పవర్ లోకి వస్తామని విశ్వాసంగా ఉంది. అన్నివర్గాల ఓటర్లను అట్రాక్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రణాళిక చేస్తోంది. అందుకు అనుగుణంగా మేనిఫెస్టో డిజైన్ పై ఫోకస్ పెట్టింది.

Also Read..KTR : కాంగ్రెస్ అంటే కన్నీళ్లు, మైగ్రేషన్, స్కామ్‌లు.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు, ఇరిగేషన్, స్కీమ్‌లు- కేటీఆర్ సెటైర్లు

తాజాగా హైదరాబాద్ గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. శ్రీధర్ బాబు చైర్మన్ అధ్యక్షతన టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ భేటీ జరిగింది. అనేక అంశాలతో పాటు అన్ని వర్గాల సంక్షేమం గురించి సుదీర్ఘంగా కమిటీ చర్చించింది. గాంధీ జయంతి అక్టోబర్ 2 నుంచి జిల్లాల పర్యటన చేయాలని నిర్ణయించింది. అక్టోబర్ 2న ఉదయం అదిలాబాద్, సాయంత్రం నిజామాబాద్ జిల్లాలలో మేనిఫెస్టో కమిటీ పర్యటించనుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు ఉచిత ఇంటర్ నెట్ సౌకర్యం కల్పించాలని మేనిఫెస్టో నిర్ణయించింది.

ఇక, ఆటో డ్రైవర్లకు ప్రత్యేకంగా ఉపయోయోగపడేలా ఒక మంచి సంక్షేమ పథకాన్ని రూపొందించాలని మేనిఫెస్టో కమిటీ డిసైడ్ అయ్యింది. త్వరలో మరికొన్ని వర్గాలకు ఉపయోగపడే విధంగా మరిన్ని పథకాల రూపకల్పన చేయనుంది. సీఆర్పీఎఫ్ మాజీ జవాన్ల సమస్యలపై మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కు సీఆర్పీఎఫ్ మాజీ సైనికోద్యోగులు వినతిపత్రం అందజేశారు.

Also Read..Kishan Reddy : మమత, స్టాలిన్ లాంటి వాళ్లు కూడా ప్రధాని మోదీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. మీరెందుకు రారు? సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి