Kishan Reddy : మమత, స్టాలిన్ లాంటి వాళ్లు కూడా ప్రధాని మోదీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. మీరెందుకు రారు? సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్ కు లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని కలిసి ఎందుకు పాల్గొనటం లేదు. Kishan Reddy

Kishan Reddy : మమత, స్టాలిన్ లాంటి వాళ్లు కూడా ప్రధాని మోదీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. మీరెందుకు రారు? సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించిన కిషన్ రెడ్డి

Kishan Reddy Questions CM KCR (Photo : Google)

Kishan Reddy – KCR : తెలంగాణలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్ పీక్స్ కి చేరింది. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సాయం విషయంలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటలతూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. తెలంగాణకు కేంద్రం ఎలాంటి సాయం చేయలేదని బీఆర్ఎస్ నాయకులు అంటుంటే.. తెలంగాణకు కేంద్రం చాలా సాయం చేసిందని బీజేపీ నాయకులు ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా ఇదే వ్యవహారంపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

తెలంగాణకు కేంద్రం సాయంపై అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ తో చర్చకు సిద్ధమని కిషన్ రెడ్డి ప్రకటించారు. దమ్ముంటే తనతో చర్చకు రావాలని బీఆర్ఎస్ కు సవాల్ విసిరారు కిషన్ రెడ్డి.

సీఎంగా కొనసాగే అర్హత కేసీఆర్ కు లేదు:
”నాకు కేసీఆర్, కేటీఆర్ సర్టిఫికెట్ అవసరం లేదు. తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగే నైతిక అర్హత కేసీఆర్ కు లేదు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రధాని మోదీతో కలిసి సీఎం కేసీఆర్ ఎందుకు పాల్గొనటం లేదో చెప్పాలి. తెలంగాణ ప్రజల మేలు అవసరం లేదు కాబట్టే.. ప్రధాని టూర్ కు కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. మమతా బెనర్జీ, స్టాలిన్ లాంటి వాళ్ళు ప్రధాని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇచ్చిన‌ హామీలు ఎందుకు అమలు చేయలేదో బీఆర్ఎస్ నేతలు చెప్పాలి.

Also Read..Komatireddy Venkata Reddy : ప్రభుత్వం ఆ పని చేస్తే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయను : కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే అర్హత లేదు:
మహిళా మంత్రి లేకుండా ఐదేళ్ళు ప్రభుత్వాన్ని నడిపిన వారికి మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడే అర్హత లేదు. మోటార్లకు మీటర్లు అనే ప్రశ్న ఉత్పన్నం కాదు. అక్టోబర్ 1న పాలమూరు ప్రజా గర్జన సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. అక్టోబర్ 3న నిజామాబాద్ లో ప్రధాని మోదీ బహిరంగ సభ ఉంటుంది. నిజామాబాద్ పర్యటనలో భాగంగా రూ.8,021 కోట్ల ప్రాజెక్టులను మోదీ ప్రారంభిస్తారు. ఎన్టీపీసీలో నూతంగా నిర్మించిన 800 మెగావాట్ల విద్యుత్ ప్రాజక్టును తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తారు.

అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన:
800 మెగావాట్లలో 680 మెగావాట్ల విద్యుత్ తెలంగాణ వినియోగించుకుంటుంది. నిజామాబాద్ టూర్ లో భాగంగా పవర్, హెల్త్, రైల్వే ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. 1369 కోట్లతో నిర్మించిన హెల్త్ సెంటర్స్ కు భూమిపూజ చేస్తారు. ఎయిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన చేస్తారు” అని కిషన్ రెడ్డి తెలిపారు.

Also Read..Bhatti Vikramarka: కేసీఆర్ గ్లోబెల్ ప్రచారానికి తెరలేపారు.. కేటీఆర్, హారీశ్ రావు, కవితనేమో..: భట్టి విక్రమార్క

మరోవైపు కరీంనగర్ లో బండి సంజయ్ కార్యాలయంపై ఎంఐఎం కార్యకర్తల చర్యను కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఎంఐఎం చాటాకు చప్పుళ్ళకు బండి సంజయ్ భయపడరని అన్నారు. ఎంఐఎం దుందుడుకు చర్యలతో సమాజం ఏమవుతుంది? అని మండిపడ్డారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత పోలీసులదే అని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి.