KKR vs SRH : బోణీ కొట్టిన కోల్‌కతా.. తొలి మ్యాచ్‌లో పోరాడి ఓడిన హైదరాబాద్..!

KKR vs SRH : కోల్‌కతా ఆటగాళ్లు ఆండ్రీ రస్సెల్, ఫిల్ సాల్ట్ విధ్వంసర బ్యాటింగ్‌తో కోల్‌కతాకు తొలి విజయాన్ని అందించారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది.

Kolkata Knight Riders to thrilling last-ball win over Hyderabad

KKR vs SRH : ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ బోణి కొట్టింది. ఈడెన్ గార్డెన్స్‌ వేదికగా శనివారం ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్‌‌తో ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. 209 పరుగుల లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ హైదరాబాద్ పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 204 పరుగులు చేసి హైదరాబాద్‌ తొలి ఓటమిని చవిచూసింది.

Read Also : ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి

క్లాసెస్ విజృంభణ.. :
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో క్లాసెన్ కేవలం 29 బంతుల్లో 63 పరుగులు చేసి హైదరాబాద్‌ను దాదాపు విజయతీరాలకు తీసుకెళ్లాడు. అయితే, పేసర్ హర్షిత్ రాణా చివరి ఐదు బంతుల్లో ఏడు పరుగులు చేసి కోల్‌కతా థ్రిల్లింగ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. హైదరాబాద్ ఓపెనర్లలో మయాంక్‌ అగర్వాల్‌ (32), అభిషేక్‌ శర్మ (32) వీరిద్దరూ తొలి వికెట్‌కు 60 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

హాఫ్ సెంచరీలతో చెలరేగిన సాల్ట్, రస్సెల్ :
ముందుగా బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో 208 పరుగులను చేసి హైదరాబాద్‌కు ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. కోల్‌కతా ఆటగాళ్లలో ఫిల్ సాల్ట్‌ (54) హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు. రస్సెల్‌ (64) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక, రమణ్‌దీప్‌ సింగ్‌ (35), రింకూ సింగ్‌ (23) పర్వాలేదనిపించారు. సన్ రైజర్స్ హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ 3 వికెట్లు తీసుకోగా, మార్కండే 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

జట్లు వివరాలు :
కోల్‌కతా నైట్ రైడర్స్ : ఫిలిప్ సాల్ట్ (వికెట్ కీపర్), వెంకటేష్ అయ్యర్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), నితీష్ రాణా, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్ , రమణదీప్ సింగ్ (సుయాష్ శర్మ స్థానంలో), మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి .

సన్‌రైజర్స్ హైదరాబాద్ : మయాంక్ అగర్వాల్ , రాహుల్ త్రిపాఠి, ఐడెన్ మార్క్‌రామ్ , హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, మార్కో జాన్సెన్, పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్ , మయాంక్ మార్కండే, టి నటరాజన్

Read Also : IPL 2024 : ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ

ట్రెండింగ్ వార్తలు