IPL 2024 : ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ తక్కువ పరుగులకే అవుట్ అయినా.. సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

IPL 2024 : ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ

Virat Kohli

Virat Kohli New Record : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. శుక్రవారం రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచ్ లో సీఎస్కే జట్టు విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన కోహ్లీ తొలుత క్రీజులో నిలదొక్కుకునే ప్రయత్నం చేసినా కొద్దిసేపటికే దూకుడుగా ఆడే ప్రయత్నం చేశాడు.. ఈ క్రమంలో 21 వ్యక్తిగత పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కోహ్లీ తక్కువ పరుగులకే అవుట్ అయినా.. ఈ మ్యాచ్ లో సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు.

Also Read : IPL 2024 : పది బంతుల్లోనే ఆర్సీబీని దెబ్బతీసిన బంగ్లాదేశ్ పేసర్.. మొన్న అలా.. నేడు ఇలా..! ఫొటోలు వైరల్

విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ కెరీర్ లో 12వేల పరుగులు పూర్తిచేశాడు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాటర్ గా గుర్తింపు పొందాడు. 35ఏళ్ల విరాట్ కోహ్లీ టీ20 ఫార్మాట్ లో క్రిస్ గేల్ (14,562), షోయబ్ మాలిక్ (13,260), కీరన్ పోలార్డ్ (13,360), అలెక్స్ హేల్స్ (12,319), డేవిడ్ వార్నర్ (12,065) తరువాత ఈ మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోనే ఆరో ప్లేయర్ గా విరాట్ కోహ్లీ ఘనత సాధించాడు. సీఎస్కేతో మ్యాచ్ లో ఆరు పరుగులు వద్దే కోహ్లీ కొత్త రికార్డును అందుకున్నాడు. ఈ జాబితాలో భారతీయ క్రికెటర్లలో కోహ్లీ తరువాత రోహిత్ శర్మ (11,156) పరుగులు చేశాడు.

Also Read : CSK vs RCB: చెన్నై బోణీ.. బెంగళూరుపై ఘన విజయం