CSK vs RCB: చెన్నై బోణీ.. బెంగళూరుపై ఘన విజయం

చెన్నై జట్టు విజయంలో శివమ్ దూబే (34 నాటౌట్), జడేజా (25 నాటౌట్) కీ రోల్ ప్లే చేశారు.

CSK vs RCB: చెన్నై బోణీ.. బెంగళూరుపై ఘన విజయం

RCB vs CSK

IPL 2024 : ఐపీఎల్ తొలి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. మరో 8 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో బెంగళూరుని చిత్తు చేసింది. 174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై.. 18.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. చెన్నై జట్టు విజయంలో శివమ్ దూబే (34 నాటౌట్), జడేజా (25 నాటౌట్) కీ రోల్ ప్లే చేశారు. రచిన్ రవీంద్ర 37 పరుగులతో రాణించాడు. ఆర్సీబీ బౌలర్లలో గ్రీన్ 2 వికెట్లు తీశాడు. యశ్ దయాల్, కర్ణ్ శర్మ తలో వికెట్ పడగొట్టారు.

ఐపీఎల్ 2024 ఇవాళ(మార్చి 22) ప్రారంభమైంది. తొలి మ్యాచులో చెన్నై, బెంగళూరు జట్లు  తలపడ్డాయి. బెంగళూరు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ఆర్సీబీ బ్యాటర్లు రజత్, మ్యాక్స్‌వెల్ మొదట్లోనే పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపర్చారు. ఓపెనర్ డుప్లెసిస్ 35 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన రజత్, మ్యాక్స్‌వెల్ వరుసగా డకౌట్ అయ్యారు. కోహ్లీ 21 పరుగులు చేసి వెనుదిరిగాడు.

కామెరూన్ గ్రీన్ 18, అనుజ్ రావత్ 48, దినేశ్ కార్తీక్ 38 (నాటౌట్) పరుగులు చేశారు. ఆర్సీబీ స్కోరు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173గా నమోదైంది. చెన్నై బౌలర్లలో ముస్తాఫిజుర్ రెహమాన్ 4 వికెట్లు, దీపక్ చాహర్ 1 వికెట్ తీశారు.

చెన్నై జట్టు: రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర, అజింక్యా రహానె, డారిల్ మిచెల్, జడేజా, రిజ్వీ, ధోనీ, చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహమాన్, తుషార్

బెంగళూరు జట్టు: డుప్లెసిస్, కోహ్లీ, రజత్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, దినేశ్ కార్తీక్, అనుజ్, కర్ణ్ శర్మ, అల్జారీ జోసెఫ్, మయాంక్ దాగర్, సిరాజ్

IPL 2024 Live Streaming : జియోసినిమాలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను మీ మొబైల్, స్మార్ట్ టీవీలో ఇలా ఫ్రీగా చూడొచ్చు..!