IPL 2024 Live Streaming : జియోసినిమాలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను మీ మొబైల్, స్మార్ట్ టీవీలో ఇలా ఫ్రీగా చూడొచ్చు..!

IPL 2024 Live Streaming : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌ వచ్చేసింది. ఐపీఎల్ 2024 టోర్నీ మార్చి 22 నుంచి మొదలవుతుంది. మీ మొబైల్ లేదా స్మార్ట్ టీవీ నుంచి మ్యాచ్‌లను ఇలా ఉచితంగా చూడవచ్చు.

IPL 2024 Live Streaming : జియోసినిమాలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను మీ మొబైల్, స్మార్ట్ టీవీలో ఇలా ఫ్రీగా చూడొచ్చు..!

How to Watch IPL Match for Free on Mobile and Smart TV

IPL 2024 Live Streaming : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ వచ్చేసింది. ఐపీఎల్ 2024 ఎడిషన్ ఈ ఏడాది టోర్నమెంట్‌లో 10 జట్ల మధ్య భీకర పోరు జరుగనుంది. ప్రతి జట్టు రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో ఇతర జట్లతో రెండు మ్యాచ్‌లు ఆడుతాయి. మొదటి 4 జట్లు ప్లేఆఫ్‌లకు అర్హత సాధిస్తాయి.

ఈ క్రికెట్ మహోత్సవాన్ని జరుపుకోవడానికి చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరుగనుంది. అయితే, మీరు మొబైల్ లేదా టీవీలో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను చూసేందుకు అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను పొందవచ్చు. ఐపీఎల్ షెడ్యూల్ వంటి ఇతర వివరాలతో పాటు ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌లో మొబైల్, స్మార్ట్‌టీవీలో మ్యాచ్‌లను ఉచితంగా చూడాలంటే? :
బీసీసీఐ ప్రసార, ప్రత్యక్ష ప్రసార హక్కులను రెండు వేర్వేరు ప్లాట్‌ఫారమ్‌లకు విక్రయించింది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను జియోసినిమాలో లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. అలాగే, (Viacom18) కూడా డిజిటల్ హక్కులను సుమారు రూ. 23,758 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు, టెలివిజన్ హక్కులను స్టార్ స్పోర్ట్స్ దాదాపు రూ. 23,575 కోట్లకు కొనుగోలు చేసింది. తద్వారా ఐపీఎల్ 2024 లైవ్ స్ట్రీమింగ్ స్టార్ స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

Read Also : IPL 2024 : ఐపీఎల్ ప్రారంభంలోనే లక్నో సూపర్ జెయింట్‌ జట్టుకు భారీ షాక్..

జియోసినిమా తన ప్లాట్‌ఫారమ్‌లో అన్ని ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. వినియోగదారులు తమ మొబైల్, స్మార్ట్ టీవీలో ఉచితంగా చూడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ టీవీ, డెస్క్‌టాప్, ఫైర్ టీవీ స్టిక్, ఆపిల్ టీవీ ప్లస్, ఫైర్ టీవీలలో డౌన్‌లోడ్ చేసేందుకు ఈ యాప్ అందరికి అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లో జియోసినిమా యాప్‌ని డౌన్‌లోడ్ చేయడం ఎలా? :
జియోసినిమా ప్లాట్‌ఫారమ్‌లో ఐపీఎల్ 2024 మ్యాచ్‌లను సులభంగా చూడవచ్చు. మీరు చేయాల్సిందల్లా ఈ జియోసినిమా యాప్ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

  • మీ మొబైల్‌లో (Google Play Store) లేదా (Apple App Store)ని ఓపెన్ చేయండి.
  • జియోసినిమా (JioCinema) అప్లికేషన్ కోసం సెర్చ్ చేయండి.
  • ఇప్పుడు జియోసినిమా యాప్ డౌన్‌లోడ్‌పై క్లిక్ చేయండి.
  • ఆండ్రాయిడ్ లేదా iOS డివైజ్‌లో అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేయండి.
  • లైవ్ స్ట్రీమింగ్ కోసం మ్యాచ్ ఐపీఎల్ బ్యానర్‌పై మాత్రమే ట్యాప్ చేసి ఫ్రీగా చూడండి.

భారత్‌లో ఐపీఎల్ 2024 లైవ్ స్ట్రీమింగ్ చూసేందుకు బెస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు ఇవే :
దేశీయ టెలికం దిగ్గజాలైన Airtel, Reliance Jio, Vodafone Idea నుంచి కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఉన్నాయి. రోజుకు గరిష్ట డేటాను పొందవచ్చు. మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఎలాంటి డేటా అంతరాయం లేకుండా సులభంగా వీక్షించవచ్చు.

ఎయిర్‌టెల్ :
రూ. 399 : ఈ ప్లాన్ రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, 28 రోజుల వ్యాలిడిటీ, ఫ్రీగా 28 రోజుల (Xstream Play) సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా
రూ. 499 : ఈ ప్యాక్ రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, 28 రోజుల వ్యాలిడిటీ, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ 3 నెలల సబ్‌స్ర్కిప్షన్, ఫ్రీగా 28 రోజుల (Xstream Play) సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా
రూ. 699 : ఈ ప్యాక్ రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, 56 రోజుల వ్యాలిడిటీ, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా 28 రోజుల (Xstream Play) సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా
రూ. 1,499 : ఈ ప్యాక్ రోజుకు 3జీబీ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, 84 రోజుల వ్యాలిడిటీ, అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్, ఉచితంగా 28 రోజుల (Xstream Play) సబ్‌స్క్రిప్షన్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా

రిలయన్స్ జియో :
రూ. 219 : 14 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ/రోజుతో పాటు 2జీబీ అదనపు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 100SMS/రోజు, జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్
రూ. 399 : 28 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ/రోజుతో పాటు 6జీబీ అదనపు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 100SMS/రోజు, జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్
రూ. 749 : 90 రోజుల వ్యాలిడిటీ, 2జీబీ/రోజుతో పాటు 20జీబీ అదనపు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 100SMS/రోజు, జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్
రూ. 999 : 84 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ/రోజు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 100SMS/రోజు, జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్
రూ. 1,499 : 84 రోజుల వ్యాలిడిటీ, 3జీబీ/రోజుతో పాటు 2జీబీ అదనపు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, అన్‌లిమిటెడ్ 5జీ డేటా, 100SMS/రోజు, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్, జియో యాప్ సూట్ సబ్‌స్క్రిప్షన్

వోడాఫోన్ ఐడియా :
రూ. 359 : ప్రీపెయిడ్ ప్లాన్ 3జీబీ/రోజు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, 28 రోజుల వ్యాలిడిటీ
రూ. 499 : ఈ రీఛార్జ్ ప్యాక్ 3జీబీ/రోజు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, 3 నెలల డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 28 రోజుల వ్యాలిడిటీ
రూ. 601 : ఈ ప్లాన్ 3జీబీ/రోజు డేటాతో పాటు 16జీబీ అదనపు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, 28 రోజుల వ్యాలిడిటీ
రూ. 699 : ఈ ప్యాక్ 3జీబీ/రోజు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు, డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక ఏడాది, 56 రోజుల వ్యాలిడిటీ
రూ. 901 : ఈ ప్లాన్ 70 రోజుల వ్యాలిడిటీ, ఒక ఏడాది డిస్నీ+ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్, రోజుకు 3జీబీ డేటాతో పాటు 48జీబీ అదనపు డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాల్స్, 100SMS/రోజు

స్మార్ట్ టీవీలో ఐపీఎల్ 2024 లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడాలి? :
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల ప్రసార హక్కులను పొందింది. వినియోగదారులు స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో మ్యాచ్‌ల లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. ఐపీఎల్ మ్యాచ్‌లను టెలిక్యాస్ట్ చేసే ఛానెల్‌ల జాబితా ఈ కింది విధంగా ఉన్నాయి.

  • స్టార్ స్పోర్ట్స్ 1
  • స్టార్ స్పోర్ట్స్ 2
  • స్టార్ స్పోర్ట్స్ 3
  • స్టార్ స్పోర్ట్స్ 1
  • స్టార్ స్పోర్ట్స్ 1 (HD)
  • స్టార్ స్పోర్ట్స్ 2 (HD)
  • స్టార్ స్పోర్ట్స్ 1 (HD) హిందీ
  • స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం
  • స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడ
  • స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు

Read Also : IPL 2024 : జియో ఎయిర్‌ఫైబర్ ప్లస్ ధన్ ధనా ధన్ ఆఫర్.. ఈ ప్లాన్‌లతో ఉచితంగా ట్రిపుల్ డేటా స్పీడ్.. ఐపీఎల్ మ్యాచ్‌లు చూడొచ్చు!