ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడ్డాయి.

ఢిల్లీ క్యాపిటల్స్‌పై పంజాబ్ కింగ్స్ విజయ దుందుభి

IPL 2024

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచులో పంజాబ్ కింగ్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయ దుందుభి మోగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 174-9 స్కోరు చేసింది. పంజాబ్ కింగ్స్ 19.2 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు బాదింది. 

పంజాబ్ బ్యాటర్లలో శిఖర్ ధావన్ 22, బెయిర్‌స్టో 9, ప్రభ్ సిమ్రాన్ సింగ్ 26, శామ్ కరణ్ 63, జితేశ్ శర్మ 9, లియామ్ 38 (నాటౌట్), శశాంక్ సింగ్ 0, హర్ప్రీత్ 2 (నాటౌట్) పరుగులు చేశారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్, ఖలీల్ రెండేసి వికెట్లు తీశారు. ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కింది.

సామ్ కరన్ హాఫ్ సెంచరీ
పంజాబ్ కింగ్స్‌ బ్యాటర్ సామ్ కరన్ హాఫ్ సెంచరీ కొట్టాడు. 39 బంతుల్లో 5 ఫోర్లతో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. ఐపీఎల్ 2024లో నమోదైన ఫస్ట్ హాఫ్ సెంచరీ ఇదే. 16 ఓవర్లలో 136/4 స్కోరుతో పంజాబ్ ఆట కొనసాగిస్తోంది.

 

పంజాబ్ 10 ఓవర్లలో 87/3
పంజాబ్ కింగ్స్‌ 10 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది. జానీ బెయిర్‌స్టో 9, ప్రభసిమ్రాన్ సింగ్ 26 పరుగులు చేసి అవుటయ్యారు.

శిఖర్ ధవన్ అవుట్
175 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన పంజాబ్ 34 పరుగుల వద్ద ఫస్ట్ వికెట్ నష్టపోయింది. కెప్టెన్ శిఖర్ ధవన్ 22 పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్ లో అవుటయ్యాడు.

నిరాశ పరిచిన రిషబ్ పంత్.. ముగిసిన ఢిల్లీ బ్యాటింగ్
పంజాబ్ కింగ్స్‌కు ఢిల్లీ క్యాపిటల్స్ 175 పరుగుల టార్గెట్ పెట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ 29, మిచెల్ మార్ష్ 20, షాయ్ హోప్ 33, రిషబ్ పంత్ 18, అక్షర్ పటేల్ 21 పరుగులు చేశారు. చివర్లో అభిషేక్ పోరెల్ అదరగొట్టాడు. 10 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 32 పరుగులు బాదాడు. పంజాబ్ బౌలర్లలో హర్షల్ పటేల్, అర్షదీప్ సింగ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. రబడ, హర్‌ప్రీత్ బ్రార్, రాహుల్ చాహర్ తలో వికెట్ తీశారు.

 

వరుసగా వికెట్ల పతనం
ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 18 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 146 పరుగులు చేసింది.

నిరాశ పరిచిన రిషబ్ పంత్
16 నెలల తర్వాత బ్యాట్ పట్టిన రిషబ్ పంత్ నిరాశపరిచాడు. తక్కువ స్కోరుకే అవుటయ్యాడు. 13 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో పెవిలియన్ దారి పట్టాడు. పంత్ స్వల్ప స్కోరుకే అవుట్ కావడంతో ఆర్పీ ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఢిల్లీ 14 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 117 పరుగులు చేసింది.

డేవిడ్ వార్నర్ అవుట్
74 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 29 పరుగులు చేసి హర్షల్ పటేల్ బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు.

మిచెల్ మార్ష్ అవుట్
39 పరుగుల వద్ద ఢిల్లీ తొలి వికెట్ కోల్పోయింది. మిచెల్ మార్ష్ 20 పరుగులు చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో అవుటయ్యాడు. 5 ఓవర్లలో 51/1 స్కోరుతో పంజాబ్ ఆట కొనసాగిస్తోంది.

ఢిల్లీ ఫస్ట్ బ్యాటింగ్
టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ ధవన్ ఫీల్డింగ్ తీసుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

తుది జట్లు
ఢిల్లీ క్యాపిటల్స్ : డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, షాయ్ హోప్, రిషబ్ పంత్ (కెప్టెన్/వికెట్ కీపర్), రికీ భుయ్, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్, ఇషాంత్ శర్మ

పంజాబ్ కింగ్స్ : శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, సామ్ కర్రాన్, లియామ్ లివింగ్‌స్టోన్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శశాంక్ సింగ్, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, రాహుల్ చాహర్, అర్ష్‌దీప్ సింగ్

IPL 2024 PK v DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 రెండో మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడుతున్నాయి. చండీగఢ్‌లోని మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి శుభారంభం చేయాలని రెండు పట్టుదలతో ఉన్నాయి. ఢిల్లీ టీమ్ కు యువ ఆటగాడు రిషబ్ పంత్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. శిఖర్ ధవన్.. పంజాబ్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు.

ఆర్పీ బ్యాక్.. ఫ్యాన్స్ ఖుషీ
454 రోజుల తర్వాత రిషబ్ పంత్ మైదానంలోకి అడుగుపెట్టాడు. రోడ్డు ప్రమాదానికి గురై కోలుకున్న తర్వాత తొలిసారిగా ఈరోజే ఆడుతున్నాడు. దీంతో ఆర్పీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తున్నారు. ఆట కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.