KL Rahul
KL Rahul : భారత్ క్రికెటర్ కేఎల్ రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి క్యాప్షన్‌లో,, ‘నేను త్వరలో ఒక ప్రకటన చేయబోతున్నాను.. చూస్తూ ఉండండి’ అంటూ పేర్కొన్నాడు. దీనిని చూసిన నెటిజన్లు రాహుల్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని పేర్కొంటున్నారు. మరికొందరు నెటిజన్లు ఐపీఎల్ 2025 గురించి రాహుల్ ఆ పోస్టు చేశారని చెబుతున్నారు. ప్రస్తుతం రాహుల్ ఇన్‌స్టా స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read : Wasim Akram : వివాహ వార్షికోత్సవం.. భర్త బట్టతల ఫోటోతో శుభాకాంక్షలు తెలిపిన వసీం అక్రమ్ భార్య..
కేఎల్ రాహుల్ 2022 నుంచి టీమిండియా తరపున టీ20 క్రికెట్ ఆడలేదు. ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచ కప్ 2024లోకూడా అతనికి చోటు దక్కలేదు. అదే సమయంలో మిగిలిన రెండు ఫార్మాట్లలో కూడా రాహుల్ కు రెగ్యులర్ గా అవకాశాలు రావడం లేదు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్ లో ఆడాడు. రెండు ఇన్సింగ్స్ లలో కేవలం 31 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే, రాహుల్ ప్రస్తుతం విరామంలో ఉన్నాడు. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్ తో భారత్ జట్టు రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్ లు ఆడుతుంది. ఆ సమయంలో జట్టులో కేఎల్ రాహుల్ ఎంపికపై ఇంకా సందేహం ఉంది. ఇలాంటి సమయంలో రాహుల్ ఇన్‌స్టా స్టోరీ ఆసక్తికరంగా మారింది. రాహుల్ ఏం చెప్పబోతున్నాడా అని ఆయన అభిమానులు, నెటిజన్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రాహుల్ ఇన్‌స్టా స్టోరీ ప్రకారం.. అతను అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పబోతున్నాడని కొందరు నెటిజన్లు పేర్కొంటుండగా.. మరికొందరు ఐపీఎల్ -2025 సీజన్ కు సంబంధించి జట్టు మార్పుపై ఆయన ప్రకటన చేస్తాడని భావిస్తున్నారు. 2024 ఐపీఎల్ సీజన్ లో కేఎల్ రాహుల్ లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు. అయితే, ఆశించిన స్థాయిలో జట్టు రాణించలేదు. ఈ క్రమంలో పలు సందర్భాల్లో రాహుల్, జట్టు యజమాని సంజీవ్ గోయాంకా మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. గోయాంకా ప్రవర్తనతో రాహుల్ కెప్టెన్సీ నుంచి వైదొలగబోతున్నాడని గతంలోనే వార్తలు వచ్చాయి. వచ్చే ఐపీల్ 2025 సీజన్ లో రాహుల్ లక్నో జట్టు నుంచి తప్పుకోబోతున్నాడని.. ఏ జట్టులో చేరబోయేది త్వరలో చెపుతానని తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో రాసిన వాఖ్యలకు అర్థమని పలువురు నెటిజన్లు పేర్కొంటున్నారు. మరి రాహుల్ ఎలాంటి ప్రకటన చేస్తాడో వేచి చూడాల్సిందే.
Instargram Stroy of KL Rahul
-He might comeback to RCB? pic.twitter.com/cfDxAXUljV
— Aditya ? (@Aditya_Kohli_18) August 22, 2024