Wasim Akram : వివాహ వార్షికోత్సవం.. భ‌ర్త‌ బ‌ట్ట‌త‌ల ఫోటోతో శుభాకాంక్ష‌లు తెలిపిన వ‌సీం అక్ర‌మ్ భార్య‌..

పాకిస్తాన్‌ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ గురించి క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Wasim Akram : వివాహ వార్షికోత్సవం.. భ‌ర్త‌ బ‌ట్ట‌త‌ల ఫోటోతో శుభాకాంక్ష‌లు తెలిపిన వ‌సీం అక్ర‌మ్ భార్య‌..

Wasim Akram wife trolls him with hilarious picture on anniversary

Updated On : August 22, 2024 / 4:18 PM IST

Wasim Akram – Shaniera : పాకిస్తాన్‌ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ గురించి క్రికెట్ అభిమానులకు ముఖ్యంగా భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఆగ‌స్టు 19న అత‌డి వివాహ వార్షికోత్స‌వం అన్న సంగ‌తి తెలిసిందే. షానీరాతో అత‌డికి పెళ్లై 11 సంవ‌త్స‌రాలు పూరైంది. ఈ సంద‌ర్భంగా అత‌డి భార్య షానీరా సోష‌ల్ మీడియా వేదిక‌గా అక్ర‌మ్‌కు వివాహ వార్షికోత్స‌వ శుభాకాంక్ష‌ల‌ను కొంత సృజ‌నాత్మ‌కంగా తెలియ‌జేసింది. షానీరా తన ఫోటోషాపింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

బ‌ట్ట‌త‌ల‌, మందంపాటి గ‌డ్డంతో ఉన్న వ‌సీం అక్ర‌మ్ ఫోటోను పోస్ట్ చేసింది. 11 సంవ‌త్సరాలైంది.. అయిన‌ప్ప‌టికి నేను నిన్ను క‌లిసిన‌ప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలాగే అందంగా ఉన్నావు అని చెప్పింది.

India tour of England : భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య 5 టెస్టు మ్యాచుల సిరీస్‌.. షెడ్యూల్ విడుద‌ల చేసిన బీసీసీఐ

‘హ్యాపీ యానివర్సరీ నా బేబీ వసీం అక్ర‌మ్‌. నా జీవితంలో మీరు ఇచ్చిన ప్రతిదానికీ ధన్యవాదాలు. నువ్వే నా ప్రపంచం. 11 సంవ‌త్సరాల క్రితం నేను నిన్ను క‌లిసిన‌ప్పుడు నువ్వు ఎంత అందంగా ఉన్నావో ఇప్ప‌టికి అలాగే ఉన్నావు. కొంచెం కూడా మార‌లేదు.’ అంటూ ఎక్స్‌లో రాసుకొచ్చింది.

ఆస్ట్రేలియాలో పుట్టింది షానీరా. అక్ర‌మ్‌కు రెండో భార్య అన్న సంగ‌తి తెలిసిందే. ఆమె పాకిస్తాన్‌లో సామాజిక కార్య‌క‌ర్త‌గా ప‌ని చేస్తుంది. అక్ర‌మ్ మొద‌టి భార్య హుమా 2009లో చ‌నిపోయింది.

Archana Kamath : పారిస్ ఒలింపిక్స్ స్టార్ అర్చన కామ‌త్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్ల‌కే ఆట‌కు వీడ్కోలు.. ఎందుకంటే..?