Archana Kamath : పారిస్ ఒలింపిక్స్ స్టార్ అర్చన కామత్ సంచలన నిర్ణయం.. 24 ఏళ్లకే ఆటకు వీడ్కోలు.. ఎందుకంటే..?
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ కీలక నిర్ణయం తీసుకుంది.

Archana Kamath
Archana Kamath : భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్ అర్చన కామత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆమె ఆటకు గుడ్ బై చెప్పేసింది. 24 ఏళ్ల కామత్ ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లనున్నట్లు వెల్లడించింది. లాస్ ఏంజల్స్ వేదికగా 2028లో జరగనున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించే అవకాశాలు తక్కువగా ఉండడం, ఆర్థిక అవసరాలు దృష్ట్యా ఆమె ప్రొఫెషనల్ ఆటకు దూరంగా ఉండనున్నట్లు తెలిసింది.
పారిస్ ఒలింపిక్స్‌లో అర్చన కామత్ ఎంతో గొప్పగా పోరాడింది. టేబుల్ టెన్నిస్‌లో భారత జట్టు ఒలింపిక్స్ చరిత్రలో తొలిసారి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడంలో ఆమె కీలక పాత్ర పోషించింది. జర్మనీతో జరిగిన క్వార్టర్స్‌లో భారత జట్టు 1-3 తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరుపున గెలిచింది అర్చన మాత్రమే.
PAK vs BAN : థర్డ్ అంపైర్ రాంగ్.. నేను రైట్.. ఫీల్డ్ అంపైర్లతో పాకిస్తాన్ కెప్టెన్ వాగ్వాదం..
పారిస్ ఒలింపిక్స్ అనంతరం.. తన కోచ్ అన్షుల్ గార్గ్‌తో కలిసి అర్చన తన అభిప్రాయాలను స్పష్టంగా తెలిపింది. దీని గురించి ఆమె కోచ్ మాట్లాడుతూ.. నాలుగేళ్ల తరువాత జరిగే లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పతకం సాధించడం చాలా కష్టమైన పని తాను చెప్పినట్లు తెలిపాడు. ‘ఎందుకంటే ఆమె టాప్- 100 ర్యాంకు జాబితాలో లేదు. గత రెండు నెలలుగా ఆమె ఎంతో శ్రమిస్తున్నప్పటికి, ప్రొషెషనల్‌గా ఎదగాలంటే మాత్రం కఠోర శ్రమ అవసరం అని వివరించా. దీంతో ఆమె విదేశాలకు వెళ్లి ఉన్నత విద్య అభ్యసించాలని అనుకుంది.’ అని వివరించారు.
అర్చన తండ్రి గిరీష్ మాట్లాడుతూ.. ‘అర్చన చదువును ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదన్నాడు. 15 ఏళ్లకు పైగా ఎంతో అంకితభావంతో టేబుల్ టెన్నిస్ ఆడింది. ఒలింపిక్స్‌లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహించిందని, ఇప్పుడు తన ఇతర అభిరుచి గురించి ఆలోచించడానికి సరైన సమయం ఆసన్నమైందన్నారు. దేశం కోసం తన అత్యుత్తమ సేవలు అందించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు.