Shreyas Iyer : ఇక్కడ సీటు ఇస్తే.. జట్టులో చోటు ఇస్తాడని అనుకుంటివా? శ్రేయస్ అయ్యర్, రోహిత్ శర్మల వీడియో వైరల్
సియెట్ అవార్డుల ప్రధానోత్సవం ముంబై వేదికగా జరిగింది.

Iyer offers his seat to Rohit Sharma
Shreyas Iyer – Rohit Sharma : సియెట్ అవార్డుల ప్రధానోత్సవం ముంబై వేదికగా జరిగింది. ఈ ఏడాదిలో అసాధారణ ప్రతిభ కనబర్చిన ఆటగాళ్లకు, క్రీడా నాయకులు 26వ ఎడిషన్ సియెట్ అవార్డులు అందుకున్నారు. ఈ అవార్డులు అందుకున్నవారిలో భారత కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లు కూడా ఉన్నారు. కాగా.. ఈ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ కార్యక్రమానికి రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ కూడా హాజరు అయ్యాడు. ముందుగా వచ్చిన శ్రేయస్ అయ్యర్ తన సీటులో కూర్చుని ఉన్నాడు. కాసేపటి తరువాత అక్కడకు వచ్చిన రోహిత్ శర్మకు సీటు దొరకలేదు. ఈ విషయాన్ని గమనించిన శ్రేయస్ అయ్యర్ తాను కూర్చున్న కుర్చీలోంచి లేచాడు. తన కుర్చీలో కూర్చోవాలని హిట్‌మ్యాన్‌ను కోరాడు. దీన్ని రోహిత్ శర్మ సున్నితంగా తిరస్కరించాడు. శ్రేయస్ సీటులో అతడినే కూర్చోమని చెబుతూ.. అతడి వెనుక ఖాళీ అయిన ఓ సీటులో కూర్చున్నాడు.
MS Dhoni : రాంచీలోని దాబాలో స్నేహితులతో కలిసి సందడిచేసిన ఎంఎస్ ధోనీ.. ఫొటో వైరల్
ఈ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. కొందరు శ్రేయస్ అయ్యర్ సీనియర్ పట్ల చూపించిన గౌరవాన్ని ప్రశంసించారు. ఇక్కడ చైర్‌లో చోటు ఇస్తే.. జట్టులో చోటు దక్కుతుందని అయ్యర్ భావించాడు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు ‘లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ లభించగా, అంతర్జాతీయ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్‌గా రోహిత్ శర్మ, వన్డే బ్యాటర్ ఆఫ్ ద ఇయర్‌గా విరాట్ కోహ్లీ, వన్డే బౌలర్ ఆఫ్ ద ఇయర్‌గా మహ్మద్ షమీ లు అవార్డులు అందుకున్నారు.
How sweetly Shreyas got up and gave his seat to Rohit Sharma. ?❤️? pic.twitter.com/goVZGDrNAW
— Pick-up Shot (@96ShreyasIyer) August 21, 2024