KL Rahul : కేఎల్ రాహుల్ కెప్టెన్సీలో టీమ్ఇండియా ఎన్ని వన్డేల్లో గెలిచిందంటే..?
ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు మొదటి రెండు వన్డేలకు విశ్రాంతిని ఇచ్చింది.

KL Rahul captaincy record
KL Rahul captaincy record : ఆస్ట్రేలియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌కు భారత జట్టును సోమవారం బీసీసీఐ (BCCI) ప్రకటించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యలకు మొదటి రెండు వన్డేలకు విశ్రాంతిని ఇచ్చింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కు విశ్రాంతి నివ్వడంతో అతడి స్థానంలో కేఎల్ రాహుల్ (KL Rahul) నాయకత్వ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ క్రమంలో రాహుల్ కెప్టెన్సీ రికార్డులపై నెటీజన్లు కన్నేశారు.
ఇంతకముందు కూడా పలు సందర్భాల్లో భారత జట్టుకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించాడు. పలు విజయాలను కూడా అందించాడు. అతడి నాయకత్వంలో భారత్ ఏడు వన్డేలు ఆడింది. నాలుగు మ్యాచుల్లో గెలుపొందగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. అయితే గెలిచిన మ్యాచులు జింబాబ్వేపైనే కావడం గమనార్హం. సౌతాఫ్రికాతో ఆడిన మూడు వన్డేల్లోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. ఈ ఏడు మ్యాచుల్లో బ్యాటర్‌గా రాహుల్ విఫలం అయ్యాడు. 36 సగటుతో 115 పరుగులు మాత్రమే చేశాడు.
మూడు టెస్టు మ్యాచులకు కూడా రాహుల్ నాయకత్వం వహించాడు. ఇందులో రెండు మ్యాచుల్లో టీమ్ఇండియా గెలవగా ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. టీ20ల్లో ఒకే ఒక్క మ్యాచ్‌కు సారథ్యం వహించగా అందులో భారత్ గెలిచింది.
రీ ఎంట్రీలో అదుర్స్..
ఐపీఎల్ 2023 సీజన్ మధ్యలో తొడకండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో టీమ్ఇండియాకు దూరం అయ్యాడు. శస్త్ర చికిత్స చేయించుకుని కోలుకున్నాడు. పూర్తి ఫిట్‌నెస్ సాధించి ఆసియాకప్‌లో కీలక మైన పాకిస్తాన్‌తో పోరులో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచులో శతకంతో సత్తా చాటాడు. తనపై వచ్చిన విమర్శలకు ఒక్క ఇన్నింగ్స్‌తోనే సమాధానం చెప్పాడు. ఆ తరువాత బంగ్లాదేశ్‌పై కూడా ఫర్వాలేదనిపించాడు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపికైయ్యాడు. వన్డే ప్రపంచకప్‌లో మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ కీలక పాత్ర పోషిస్తాడని పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 12 సంవత్సరాల తరువాత మరోసారి భారత్ ప్రపంచకప్‌ను ముద్దాడాలని సగటు భారత క్రికెట్ అభిమాని కోరుకుంటున్నారు.
Sanju Samson : జట్టులో దక్కని చోటు.. సంజు శాంసన్ వరుస పోస్ట్‌లు..