KL Rahul: చిన్నారి చికిత్స కోసం కేఎల్ రాహుల్ భారీ విరాళం

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ చిన్నారి ప్రాణం కాపాడేందుకు భారీ విరాళమిచ్చారు.

KL Rahul: చిన్నారి చికిత్స కోసం కేఎల్ రాహుల్ భారీ విరాళం

Kl Rahul

Updated On : February 22, 2022 / 7:57 PM IST

KL Rahul: టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కెప్టెన్ కేఎల్ రాహుల్ చిన్నారి ప్రాణం కాపాడేందుకు భారీ విరాళమిచ్చారు. బ్లడ్ డిజార్డర్ తో బాధపడుతున్న చిన్నారి క్రికెటర్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైంది. వరద్ అనే ఆ చిన్నారికి అర్జెంటుగా బోన్ మారోను ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారు.

‘వరద్ పరిస్థితి గురించి తెలియగానే నా మనుషులను టచ్ లో ఉండమని చెప్పాను. GiveIndia పేరుతో అతనికి సాయం చేయగలిగాం. సర్జరీ సక్సెస్ అయినందుకు సంతోషంగా ఉన్నా. ఇప్పుడు కుదురుకున్నాడు. తిరిగి అతని కాళ్లపై నిలబడి కలలను సాకారం చేసుకుంటాడని అనుకుంటున్నా. నేను చేసిన ఈ సాయం మరింతమందికి ప్రేరణగా నిలిచి అవసరమని ముందుకొచ్చిన వాళ్లకు సాయం చేసేదిగా అవుతుందని అనుకుంటున్నా’ అని కేఎల్ రాహుల్ అన్నారు.

వరద్ తల్లి స్వప్న మాట్లాడుతూ.. ‘కేఎల్ రాహుల్ చేసిన విరాళానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. వరద్ సర్జరీ కోసం భారీ విరాళమిచ్చాడు. లేదంటే ఇంత తక్కువ సమయంలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం సాధ్యమయ్యేది కాదు. థ్యాంక్యూ రాహుల్’ అంటూ కన్నీటి పర్యంతమయ్యింది ఆ తల్లి.

Read Also: కేఎల్ రాహుల్ కెప్టెన్‌గా లక్నో జట్టు లోగో ఇదే

టీమిండియా ప్లేయర్ తనకు తానుగా వచ్చి సాయం చేస్తాడని వరద్ కుటుంబం ఎప్పుడూ ఊహించలేదు. వరద్ ఎప్పుడూ భవిష్యత్ లో టీమిండియాకు ఆడటం తన కల అని చెప్పేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. క్రికెట్ అభిమానులంతా రాహుల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.