KL Rahul : సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్.. టీమిండియా వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..

భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సారథ్యం వహించేది ఎవరు అనేది తేలిపోయింది. టీమిండియా టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది.

KL Rahul Vice Captain: భారత క్రికెట్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా సారథ్యం వహించేది ఎవరు అనేది తేలిపోయింది. టీమిండియా టెస్టు సిరీస్ కోసం సౌతాఫ్రికాలో పర్యటించనుంది. ఈ టెస్టు సిరీస్ జట్టుకు కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు బీసీసీఐ (BCCI) ఒక ప్రకటనలో వెల్లడించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ స్థానంలో కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. రోహిత్ శర్మకు గాయం కారణంగా టెస్టు సిరీస్ కు దూరమయ్యాడు. అతడి

తోడ ఎముకకు గాయమైంది. రోహిత్ టెస్టు సిరీస్ నుంచి తప్పుకోవడంతో అతడి స్థానంలో ఎవరు వైస్ కెప్టెన్ అనేది ప్రశ్నార్థకంగా మారింది. చాలామంది పేర్లు తెరపైకి రాగా.. చివరికి కేఎల్ రాహుల్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. సౌతాఫ్రికా టూర్‌కు ముందే.. అజింక్య రహానే కొంతకాలం వరకు టీమిండియాకు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. గత ఏడాదికాలంగా రహానె పేలవమైన ఆట తీరు కారణంగా అతన్ని వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించేలా చేసింది. దీనికారణంగానే బీసీసీఐ రహానెను వైస్ కెప్టెన్సీ నుంచి తొలగించింది.

2021 ఏడాది టెస్టుల్లో టీమిండియా తరఫున సక్సెస్ ఫుల్ బ్యాట్స్‌మెన్‌గా రాణిస్తున్న రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే టెస్టు జట్టుకు రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా ఉండాల్సి ఉంది.. కానీ, రోహిత్ గాయం కారణంగా ఆ ఛాన్స్… కేఎల్ రాహుల్ కు దక్కింది. రోహిత్‌ శర్మ కూడా సంతోషం వ్యక్తం చేసినట్టు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి.

దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా మూడు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. టెస్టు సిరీస్‌లో భారత్‌కు కేఎల్ రాహుల్ బాధ్యత వహించనున్నాడు. దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్ ఓపెనర్లలో కేఎల్ రాహుల్‌కు మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ పార్టనర్ అయ్యే అవకాశం ఉంది. సౌతాఫ్రికాలో జనవరి 19, 2022 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌ సమయానికి రోహిత్ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు.

Read Also : Omicron Centres : ఒమిక్రాన్‌పై ప్రభుత్వం అలర్ట్‌.. డెడికేటెడ్ సెంటర్లుగా 4 ఆస్పత్రులు

ట్రెండింగ్ వార్తలు