Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరో విజయాన్ని నమోదు చేసింది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ పై 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ అదరగొట్టాడు. 45 బంతులను ఎదుర్కొని 4 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 62 పరుగులతో అజేయంగా నిలిచి ఆర్‌సీబీ విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే.. మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ చేసిన ఓ పని అతడి అభిమానుల్లో ఆందోళన రేకెత్తించింది.
ఆర్‌సీబీ ఇన్నింగ్స్ 15వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను వనిందు హసరంగ వేశాడు. ఈ ఓవర్‌లోని నాలుగో బంతికి కోహ్లీ రెండు పరుగులు తీశాడు. అయితే.. రెండు పరుగులు తీయడంతో ఆయాసానికి లోనైన కోహ్లీ వికెట్ కీపర్ సంజూ శాంసన్ దగ్గరికి వెళ్లి తన హార్ట్ బీట్ చెక్ చేయాలని కోరాడు. వెంటనే శాంసన్ తన గ్లోవ్స్ తీసి.. కోహ్లీ చాతిపై చేతిని పెట్టి హార్ట్ బీట్‌ను చెక్ చేశాడు. అంతా బాగానే ఉందని శాంసన్ చెప్పాడు. దీంతో కోహ్లీ బ్యాటింగ్ కొనసాగించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కోహ్లీకి ఏమైంది ? అతడికి ఏమైన గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయా ? అని కొందరు ఆందోళన చెందుతున్నాడు. తీవ్రమైన ఎండలో బ్యాటింగ్ చేయడంతో డీహైడ్రెషన్‌కు కోహ్లీ లోనై ఉంటాడని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. టీ20ల్లో అతడికి ఇది వందో హాఫ్ సెంచరీ కావడం విశేషం. ఈ క్రమంలో టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన రెండో ఆటగాడిగా కోహ్లీ రికార్డులకు ఎక్కాడు. అతడి కంటే ముందు డేవిడ్ వార్నర్ ఉన్నాడు.
టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..
డేవిడ్ వార్నర్ – 108
విరాట్ కోహ్లీ – 100
బాబర్ అజామ్ – 90
క్రిస్ గేల్ – 88
జోస్ బట్లర్ – 86
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 173 పరుగులు సాధించింది. యశస్వి జైస్వాల్ (75 47 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, జోష్ హేజిల్‌వుడ్, కృనాల్ పాండ్యా లు తలా ఓ వికెట్ సాధించారు.
Kohli asking Sanju to check his heartbeat? What was this 😳 pic.twitter.com/2vodlZ4Tvf
— Aman (@AmanHasNoName_2) April 13, 2025
అనంతరం ఫిల్ సాల్ట్ (65 33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (62 నాటౌట్ 45 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగగా.. దేవ్‌దత్ పడిక్కల్ (40 నాటౌట్ 28 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) రాణించడంతో లక్ష్యాన్ని 17.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి అందుకుంది.