DC vs MI : ఈ సీజన్‌లో తొలి ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ కామెంట్స్ వైరల్.. ఎలా ఓడిపోయామంటే..?
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి పరాజయం ఎదురైంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి ఈ సీజన్‌ను ఘనంగా ఆరంభించిన ఢిల్లీ జట్టుకు ముంబై ఇండియన్స్ షాకిచ్చింది. ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఢిల్లీ 12 పరుగుల తేడాతో ఓడిపోయింది.
ఢిల్లీ ఇన్నింగ్స్ 19 ఓవర్ వరకు గెలుస్తుందనే అంతా గెలుస్తుందని అనుకున్నారు. ఢిల్లీ విజయ సమీకరణం చివరి 9 బంతుల్లో 15 పరుగులుగా ఉంది. ధాటిగా బ్యాటింగ్ చేయగల అశుతోష్ పాటు స్టార్క్ క్రీజులో ఉన్నాడు. అయితే.. గెలుపు ముంగిట రనౌట్లు ఆ జట్టు కొంప ముంచాయి. ఒత్తిడిలో వరుసగా మూడు బంతుల్లో ముగ్గురు బ్యాటర్లు రనౌట్ కావడంతో ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసింది. కాగా.. ఈ మ్యాచ్‌లో ఓడిపోవడంతో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ నిరాశ చెందాడు. తమ జట్టు ఓటమికి పేలవమైన షాట్ల ఎంపికే కారణం అని చెప్పాడు.
Abhishek Sharma : ఏం అదృష్టం బ్రో.. నక్కతోక తొక్కివచ్చావా ఏందీ..!
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ (59; 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా.. సూర్యకుమార్ యాదవ్ (40; 28 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రికిల్‌టన్ (41; 25 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ ధీర్ (38 నాటౌట్; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్, కుల్దీప్ యాదవ్‌లు చెరో రెండు వికెట్లు తీశారు. ముకేశ్ కుమార్ ఓ వికెట్ సాధించాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో ఢిల్లీ 19 ఓవర్లలో 193 పరుగులకే కుప్పకూలింది. ఢిల్లీ బ్యాటర్లలో కరుణ్ నాయర్ (89; 40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీ బాదాడు. అభిషేక్ పోరెల్ (33) రాణించాడు. మిగిలిన వారు విఫలం అయ్యారు. ముంబై బౌలర్లలో కర్ణ్ శర్మ మూడు వికెట్లు తీశాడు. మిచెల్ సాంట్నర్ రెండు వికెట్లు పడగొట్టారు. జస్‌ప్రీత్ బుమ్రా ఓ వికెట్ సాధించాడు.
మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్లే..
మ్యాచ్ అనంతరం తమ జట్టు ఓటమిపై ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ స్పందించాడు. వాస్తవానికి ఈ మ్యాచ్‌లో తాము గెలవాల్సి ఉందన్నాడు. మిడిల్ ఆర్డర్ వైఫల్యం తమ కొంపముంచిందన్నారు. పేలవ షాట్లతో వికెట్లు చేజార్చుకున్నామన్నాడు. ప్రతీసారి లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు మ్యాచ్‌ను గెలిపించడం సాధ్యం కాదన్నారు.
కొన్ని సార్లు ఇలా జరుగుతుందని, దీని గురించి అతిగా ఆలోంచిచాల్సిన అవసరం లేదన్నాడు. ‘డ్యూ ఫ్యాక్టర్ కూడా కలిసి వచ్చింది. ఫీల్డింగ్‌లో కొన్ని తప్పులను చేశాము. క్యాచ్‌లను వదిలి ఉండకపోతే లక్ష్యం ఇంకొంచెం తక్కువగా ఉండేది. కరణ్ నాయర్ అద్భుతంగా ఆడాడు.’ అని అక్షర్ పటేల్ అన్నాడు.
కుల్దీప్ యాదవ్ కూడా నాణ్యమైన బౌలింగ్‌ను వేస్తున్నాడు. వికెట్ అవసరమైన ప్రతిసారి అతడికి బంతిని ఇస్తానని అక్షర్ వెల్లడించాడు. ఈ రోజు చాలా మంచి విషయాలు జరిగాయని అనుకుంటున్నాని, ఈ మ్యాచ్‌ను మరిచిపోవాలన్నాడు.