SRH vs PBKS : సన్‌రైజర్స్ పై ఓటమి.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కామెంట్స్ వైరల్.. ‘నాకు నవ్వొస్తుంది..’
సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓడిపోవడంపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.

Courtesy BCCI
భారీ స్కోరు సాధించినప్పటికి సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతిలో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది. శనివారం ఉప్పల్ వేదికగా ఎస్ఆర్‌హెచ్ చేతిలో పంజాబ్ 8 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తమ పేసర్ లాకీ ఫెర్గూసన్ గాయపడడం తమ విజయావకాశాలను దెబ్బతీసిందని పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ తెలిపాడు. అతడు గాయపడకపోతే.. జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు తీసేవాడన్నాడు.
ఈ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. పంజాబ్ బ్యాటర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (82; 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (42; 23 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), మార్క్ స్టోయినిస్ (34 నాటౌట్; 11 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్సర్లు) దంచికొట్టారు. ఎస్ఆర్‌హెచ్ బౌలర్లలో హర్షల్ పటేల్ నాలుగు వికెట్లు తీశాడు. ఎషాన్ మలింగ రెండు వికెట్లు పడగొట్టాడు.
Abhishek Sharma : విధ్వంకర సెంచరీ తరువాత అభిషేక్ శర్మ కామెంట్స్.. వారి వల్లే ఈ శతకం..
అనంతరం అభిషేక్ శర్మ (141; 55 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్సర్లు) విధ్వంసకర శతకానికి తోడు ట్రావిస్ హెడ్ (66; 37 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు తోడు కావడంతో లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ 18.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అందుకుంది.
మ్యాచ్ అనంతరం ఓటమిపై పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ స్పందించాడు. కీలక సమయంలో క్యాచ్‌లను వదిలివేయడం, స్టార్ పేసర్ ఫెర్గూసన్ గాయపడడం తమ ఓటమిని శాసించిందని చెప్పాడు.
‘నిజం చెప్పాలంటే ఇది అద్భుతమైన స్కోరు. అయినప్పటికి ఈ టార్గెట్‌ను సన్‌రైజర్స్ రెండు ఓవర్లు మిగిలి ఉండగానే ఛేదించిందంటే నాకు నవ్వొస్తుంది. మేం కొన్ని క్యాచ్‌లను పట్టుకోలేకపోయాం. అభిషేక్ శర్మ కు ఈ రోజు అదృష్టం కలిసివచ్చింది. ఒక్క మాటలో చెప్పాలంటే మేము అంచనాలకు తగ్గట్లుగా బౌలింగ్ చేయలేకపోయాం. అని శ్రేయస్ అయ్యర్ అన్నాడు.
ఈ మ్యాచ్ నుంచి పాఠాలు నేర్చుకుంటామని, తాము చేసిన తప్పిదాల గురించి మాట్లాడుకుని సవరించుకుంటామని చెప్పాడు. ఇక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ.. వారి పార్ట్‌నర్ షిప్ అసాధారణం అని తెలిపాడు. వారు ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదన్నాడు. తమ బౌలింగ్ రొటేషన్ ఇంకాస్త మెరుగ్గా ఉండే బాగుండేదన్నాడు.
ఫెర్గూసన్ గాయం తీవ్ర నష్టం చేసిందన్నాడు. అతడు జట్టుకు అవసరమైనప్పుడు వికెట్లు తీసే బౌలర్ అని చెప్పాడు. అయినప్పటికి ఆటలో గాయాలు సహజం అని అన్నాడు. తాను, నేహల్ వధేలా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు 230 మంచి టార్గెట్ అని భావించామని, కానీ రెండో ఇన్నింగ్స్‌లో డ్యూ రావడంతో బౌలర్లకు కష్టమైందన్నాడు. తాను చూసిన అత్యుత్త ఇన్నింగ్స్‌ల్లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఒకటి అని అన్నాడు.