CSK : 30,500 మొక్క‌లు నాటేందుకు సాయం చేసిన చెన్నై బ్యాట‌ర్లు.. స‌మాజం కోసం సీఎస్‌కే నిస్వార్థ చ‌ర్య‌..

కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ చేతిలో సీఎస్‌కే ఘోర ఓట‌మి నేప‌థ్యంలో చెన్నై జ‌ట్టు పై సోష‌ల్ మీడియాలో మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి.

CSK : 30,500 మొక్క‌లు నాటేందుకు సాయం చేసిన చెన్నై బ్యాట‌ర్లు.. స‌మాజం కోసం సీఎస్‌కే నిస్వార్థ చ‌ర్య‌..

IPL 2025 CSK have contributed to planting trees instead of winning the game

Updated On : April 12, 2025 / 2:20 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ కు ఏదీ క‌లిసి రావ‌డం లేదు. వ‌రుస ఓట‌ములు ఎదుర‌వుతున్నాయి. ఫామ్‌లో ఉన్న రెగ్యుల‌ర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. 5 సార్లు ఐపీఎల్ ట్రోఫీని అందించిన ధోని ప‌గ్గాలు అందుకోవ‌డంతో సీఎస్‌కే రాత మారుతుంద‌ని ఫ్యాన్స్ ఆశించారు. అయితే.. అలా జ‌ర‌గలేదు. శుక్ర‌వారం చెపాక్ వేదిక‌గా కోల్‌క‌తా నైట్‌నైడర్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఘోర ప‌రాభ‌వాన్ని ఎదుర్కొంది.

ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే చెన్నైకి ఇదే అత్యంత ఘోర ఓట‌మి. చెన్నై పై మ‌రో 59 బంతులు మిగిలి ఉండ‌గానే ప్ర‌త్య‌ర్థి ల‌క్ష్యాన్నిఛేదించ‌డం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల న‌ష్టానికి 103 ప‌రుగులు చేశాడు. చెన్నై బ్యాట‌ర్ల‌లో శివమ్‌ దూబె (31 నాటౌట్‌), విజ‌య్ శంక‌ర్ (29)లు పర్వాలేద‌నిపించారు. మిగిలిన ఆట‌గాళ్లు విఫ‌లం అయ్యారు. ఈ స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని 10.1 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ అందుకుంది.

Nicholas Pooran : గుజ‌రాత్‌తో మ్యాచ్‌.. ల‌క్నో స్టార్ ఆట‌గాడు నికోల‌స్ పూర‌న్‌ను ఊరిస్తున్న మూడు భారీ రికార్డులు ఇవే..

కాగా.. ఈ మ్యాచ్‌లో 120 బంతులు ఆడిన చెన్నై బ్యాట‌ర్లు క‌నీసం 120 ప‌రుగులు కూడా చేయ‌లేక‌పోయారు. టీ20ల్లో టెస్టును త‌ల‌పించారు. చెన్నై ఇన్నింగ్స్‌లో 61 డాట్ బాల్స్‌ ఉన్నాయంటే ఆ జ‌ట్టు బ్యాట‌ర్లు ఎలా ఆడారో ఊహించుకోవ‌చ్చు. దీంతో చెన్నై ఆట‌తీరుపై సోష‌ల్ మీడియాలో తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి.

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో ఒక డాట్ బాల్ కు 500 మొక్క‌లు నాటేలా టాటా గ్రూప్‌తో బీసీసీఐ ఒప్పందం కుదుర్చుకున్న సంగ‌తి తెలిసిందే. సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో 61 డాట్ బాల్ న‌మోదు కావ‌డంతో 61*500 = 31500 మొక్క‌లు నాట‌నున్నారు.

మ్యాచ్‌లు గెలిచేందుకు సీఎస్‌కే ఆడడం లేద‌ని మొక్క‌లు నాటి ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించేందుకు సీఎస్‌కే టీమ్ న‌డుం బిగించింద‌ని నెట్టింట మీమ్స్ వైర‌ల్ అవుతున్నాయి.

CSK vs KKR : వ‌రుస‌గా ఐదో మ్యాచ్‌లో చెన్నై ఓట‌మి.. ధోని కామెంట్స్ వైర‌ల్‌.. మేం ఎందుకు ఓడిపోతున్నామంటే..