Nicholas Pooran : గుజరాత్‌తో మ్యాచ్.. లక్నో స్టార్ ఆటగాడు నికోలస్ పూరన్‌ను ఊరిస్తున్న మూడు భారీ రికార్డులు ఇవే..
లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల్లో 72 సగటు 225కి పైగా స్ట్రైక్‌రేటుతో 288 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. శనివారం లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో పూరన్‌ను ఓ మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.
టీ20ల్లో 9వేల పరుగులు..
నికోలస్ పూరన్ ఇప్పటి వరకు 363 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 29.47 సగటు 150.08 స్ట్రైక్‌రేటుతో 8,930 పరుగులు చేశాడు. అతడు మరో 70 పరుగులు చేస్తే టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో టీ20ల్లో 9వేల పరుగులు చేసిన 25వ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం పూరన్ ఉన్న ఫామ్‌ను చూసుకుంటే అతడు గుజరాత్‌తో మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
LSG vs GT : లక్నోతో మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్..
టీ20ల్లో 600 ఫోర్లు..
నికోలస్ పూరన్ ఇప్పటి వరకు టీ20ల్లో 599 ఫోర్లు కొట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతడు ఒక్క ఫోర్ కొడితే.. 600 ఫోర్లు మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో టీ20ల్లో 600 ఫోర్లు కొట్టిన 63వ ఆటగాడిగా నిలవనున్నాడు.
ఎకానా స్టేడియంలో 300 పరుగులు..
లక్నో హోం గ్రౌండ్ ఎకానా స్టేడియం అన్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో పూరన్ 17 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 135.53 స్ట్రైక్‌రేటుతో 23.08 సగటుతో 277 పరుగులు చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతడు 23 పరుగులు సాధిస్తే.. ఎకానా స్టేడియంలో 300 పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలవనున్నాడు.
ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ ఈ మైదానంలో 509 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (337), మార్కస్ స్టోయినిస్ (336) లు ఆతరువాతి స్థానాల్లో ఉన్నారు.