Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నికోలస్ పూరన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. 5 మ్యాచ్‌ల్లో 72 సగటు 225కి పైగా స్ట్రైక్‌రేటుతో 288 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఈ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. శనివారం లక్నో జట్టు గుజరాత్ టైటాన్స్‌తో తలపడనుంది. ఈ నేపథ్యంలో పూరన్‌ను ఓ మూడు రికార్డులు ఊరిస్తున్నాయి.
టీ20ల్లో 9వేల పరుగులు..
నికోలస్ పూరన్ ఇప్పటి వరకు 363 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 29.47 సగటు 150.08 స్ట్రైక్‌రేటుతో 8,930 పరుగులు చేశాడు. అతడు మరో 70 పరుగులు చేస్తే టీ20ల్లో 9వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో టీ20ల్లో 9వేల పరుగులు చేసిన 25వ ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం పూరన్ ఉన్న ఫామ్‌ను చూసుకుంటే అతడు గుజరాత్‌తో మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
LSG vs GT : లక్నోతో మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్..
టీ20ల్లో 600 ఫోర్లు..
నికోలస్ పూరన్ ఇప్పటి వరకు టీ20ల్లో 599 ఫోర్లు కొట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతడు ఒక్క ఫోర్ కొడితే.. 600 ఫోర్లు మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలో టీ20ల్లో 600 ఫోర్లు కొట్టిన 63వ ఆటగాడిగా నిలవనున్నాడు.
ఎకానా స్టేడియంలో 300 పరుగులు..
లక్నో హోం గ్రౌండ్ ఎకానా స్టేడియం అన్న సంగతి తెలిసిందే. ఈ స్టేడియంలో పూరన్ 17 టీ20 ఇన్నింగ్స్‌ల్లో 135.53 స్ట్రైక్‌రేటుతో 23.08 సగటుతో 277 పరుగులు చేశాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో అతడు 23 పరుగులు సాధిస్తే.. ఎకానా స్టేడియంలో 300 పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలవనున్నాడు.
ఈ స్టేడియంలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కేఎల్ రాహుల్ పేరిట ఉంది. రాహుల్ ఈ మైదానంలో 509 పరుగులు చేశాడు. ఇషాన్ కిషన్ (337), మార్కస్ స్టోయినిస్ (336) లు ఆతరువాతి స్థానాల్లో ఉన్నారు.