IPL 2025 LSG vs GT preview : లక్నో, గుజరాత్‌లలో పైచేయి ఎవరిదో తెలుసా? పిచ్ రిపోర్ట్, హెడ్-టు-హెడ్, తుది జట్ల అంచనా..
శనివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.

IPL 2025 LSG vs GT preview Predicted 11s head to head details
ఐపీఎల్ 2025 సీజన్‌లో మరో ఆసక్తికర సమరానికి రంగం సిద్దమైంది. శనివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి.
ఈ సీజన్‌లో ఇప్పటి వరకు గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్‌లు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచింది. మరో మ్యాచ్‌లో ఓడిపోయింది. 8 పాయింట్లు ఆ జట్టు ఖాతాలో ఉన్నాయి. నెట్ రన్‌రేట్ +1.413గా ఉంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో గుజరాత్ అగ్రస్థానంలో ఉంది.
CSK vs KKR : ధోని ప్లాన్ ఫెయిల్.. కోటీ 70లక్షలు దండగా.. వికెట్లు పడుతున్నాయని..
అటు లక్నో సైతం ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో మూడు మ్యాచ్‌ల్లో గెలవగా మరో రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో 6 పాయింట్లు ఉన్నాయి. నెట్‌రన్‌రేట్ +0.078గా ఉంది. ప్రస్తుతం లక్నో పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కొనసాగుతోంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం లక్నో ఆత్మవిశ్వాసాన్ని పెంచేదే.
హెడ్ టు హెడ్..
ఐపీఎల్‌లో ఇప్పటి వరకు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు 5 మ్యాచ్‌ల్లో ముఖాముఖిగా తలపడ్డాయి. ఇందులో నాలుగు మ్యాచ్‌ల్లో గుజరాత్ విజయం సాధించగా, ఓ మ్యాచ్‌లో లక్నో గెలిచింది. ఇక లక్నోలోని ఎకానా స్టేడియంలో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. ఇందులో చెరో మ్యాచ్‌లో గెలుపొందాయి. చివరిసారిగా జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ పై లక్నో 33 పరుగుల తేడాతో గెలుపొందింది.
పిచ్..
లక్నోలోని పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ 16 మ్యాచ్‌లు జరుగగా సగటు స్కోరు 164గా ఉంది. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 8 సందర్భాల్లో గెలవగా, ఛేజింగ్ చేసిన జట్లు ఏడు సందర్భాల్లో విజయం సాధించాయి. ఓ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. కాగా.. ఈ సీజన్‌లో సగటు స్కోరు 195 పరుగులుగా ఉంది. దీంతో నేటి మ్యాచ్‌లో పరుగుల వరద పారొచ్చు.
CSK vs KKR : ధోని నాటౌటా? చెన్నై కెప్టెన్ వివాదాస్పద ఔట్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..
తుది జట్ల అంచనా..
లక్నో సూపర్ జెయింట్స్..
మిచెల్ మార్ష్ , ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్ , శార్దూల్ ఠాకూర్, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్ , దిగ్వేష్ రాఠీ
ఇంపాక్ట్ సబ్: రవి బిష్ణోయ్
CSK vs KKR : వరుసగా ఐదో మ్యాచ్‌లో చెన్నై ఓటమి.. ధోని కామెంట్స్ వైరల్.. మేం ఎందుకు ఓడిపోతున్నామంటే..
గుజరాత్ టైటాన్స్..
సాయి సుదర్శన్, శుభమాన్ గిల్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్ , రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్ , ప్రసిద్ధ కృష్ణ
ఇంపాక్ట్ సబ్: కుల్వంత్ ఖేజ్రోలియా / వాషింగ్టన్ సుందర్