CSK vs KKR : ధోని నాటౌటా? చెన్నై కెప్టెన్ వివాదాస్పద ఔట్ పై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ..
ధోని ఎల్బీడబ్ల్యూ ఔట్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనడుస్తోంది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిపోయింది. శుక్రవారం చెపాక్ వేదికగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది. కాగా.. ఈ మ్యాచ్‌లో చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోని ఔట్‌కు సంబంధించి సోషల్ మీడియాలో తీవ్ర చర్చ నడుస్తోంది.
ఈ మ్యాచ్‌లో చెన్నై మొదట బ్యాటింగ్ చేసింది. రచిన్ రవీంద్ర (4), డేవాన్ కాన్వే (12), రాహుల్ త్రిపాఠి (16), రవిచంద్రన్ అశ్విన్ (1), రవీంద్ర జడేజా (0), దీపక్ హుడా (0), విజయ్ శంకర్ (29)లు త్వరిత గతిన ఔట్ కావడంతో చెన్నై 72 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఓ వైపు చెన్నై వేగంగా వికెట్లు కోల్పోతుండడంతో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వస్తాడని అంతా భావించారు. అయితే.. జడేజా, అశ్విన్‌ల తరువాతనే తొమ్మిదో స్థానంలోనే ధోని బ్యాటింగ్‌కు వచ్చాడు. నాలుగు బంతులను ఎదుర్కొన్నాడు. ఒక్క పరుగు మాత్రమే చేసి సునీల్ నరైన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. 8వ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
అయితే.. ధోని ఎల్బీడబ్ల్యూ ఔట్‌కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనడుస్తోంది. సునీల్ నరైన్ వేసిన బంతిని ధోని డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే.. బంతి బ్యాట్‌ను తాకకుండా ప్యాడ్లను తాకింది. దీంతో ఔట్ అంటూ కోల్‌కతా ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ ఔట్ ఇచ్చాడు. వెంటనే ధోని రివ్య్వూ తీసుకున్నాడు.
రిప్లేలో బంతి బ్యాట్‌ను దాటి వెళ్లినప్పుడు అల్ట్రా ఎడ్జ్‌లో చాలా చిన్న స్పైక్‌లు వచ్చాయి. అయినప్పటికి థర్డ్ అంపైర్.. ఫీల్డ్ అంపైర్ నిర్ణయంతోనే ఏకీభవించాడు. ఇది సోషల్ మీడియాలో చర్చకు కారణమైంది. చాలా మంది థర్డ్ అంపైర్ నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి చెన్నై 103 పరుగులు చేసింది. అనంతరం సునీల్ నరైన్ (44; 18 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సర్లు) దంచికొట్టగా.. క్వింటన్ డికాక్ (23), అజింక్యా రహానే (20 నాటౌట్), రింకూ సింగ్ (15నాటౌట్)లు రాణించడంతో లక్ష్యాన్ని కేకేఆర్ 10.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది.
The ball clearly touched the bat .. it’s Not Out…#Dhoni #KKRvsCSK #KKRvCSK pic.twitter.com/Ac5v0IqOCt
— Songs Lover (@Songs_Lover_) April 11, 2025
Ipl match fixing proof.
Dhoni is clearly not out but given out by 3rd umpire.#fixing#ipl2025#matchfixing#Dhoni pic.twitter.com/29DcuH7Nrz— Aditya007 (@AdityaSaha007) April 11, 2025
Ms Dhoni clearly not out… Umpire pagal hai spike bhi and gap toh bilkul nhi hai😳
what your take….???#CSKvsKKR pic.twitter.com/wqjJHwjYEt— 𝐓𝐇𝐄 𝐒𝐔𝐍𝐍𝐘 𝐍𝐀𝐑𝐖𝐀𝐋 (@TheSunnyNarwal) April 11, 2025