LSG vs GT : లక్నోతో మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్..
లక్నోతో మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్‌కు భారీ షాక్ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో ఇప్పటి వరకు 5 మ్యాచ్‌లు ఆడిన ఆ జట్టు నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఓ మ్యాచ్‌లో ఓడిపోయింది. 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
శనివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో గుజరాత్ టైటాన్స్ తలపడనుంది. మరికొన్ని గంటల్లో మ్యాచ్ ప్రారంభం కానుందనగా గుజరాత్ జట్టుకు భారీ షాక్ తగిలింది. న్యూజిలాండ్ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లకు దూరం అయ్యాడు. గాయం కారణంగా అతడు న్యూజిలాండ్‌కు పయనం అయ్యాడు. అతడు గజ్జ గాయంతో బాధపడుతున్నట్లుగా తెలుస్తోంది.
ఐపీఎల్ 2025 మెగా వేలంలో గుజరాత్ గ్లెన్ ఫిలిప్స్ రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో అతడికి ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు. అయితే.. ఏప్రిల్ 6న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్‌గా వచ్చాడు. ఇషాన్ కిషన్ కొట్టిన బంతిని ఆపే క్రమంలో గాయపడ్డాడు.
🚨 A BIG SET-BACK FOR GUJARAT 🚨
Glenn Phillips set to miss the remainder of IPL 2025 due to a groin injury. [Espn Cricinfo] pic.twitter.com/bTuOyw980Q
— Johns. (@CricCrazyJohns) April 12, 2025
ఫిజియో వచ్చి అతడిని బయటకు తీసుకువెళ్లాడు. కాగా.. గజ్జలో నొప్పి తీవ్రం కావడంతో అతడు సీజన్ మొత్తానికి దూరం అయినట్లు గుజరాత్ టైటాన్స్ శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. అతడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
కాగా 28 ఏళ్ల గ్లెన్ ఫిలిఫ్స్ ప్రపంచంలోని ఉత్తమ ఆల్‌రౌండర్లలో ఒకడు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇటీవల ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో కివీస్ తరుపున పలు అద్భుత క్యాచ్‌లను అందుకున్నాడు. ఇలాంటి ఓ అద్భుత ఫీల్డర్ దూరం కావడం టైటాన్స్‌కు ఓ రకంగా ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.
ప్రస్తుతం టైటాన్స్ జట్టులో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు జోస్ బట్లర్, షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్, రషీద్ ఖాన్, జెరాల్డ్ కోట్జీ, కరీం జనత్ లు మాత్రమే అందుబాటులో ఉన్నారు. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ కగిసో రబాడ వ్యక్తిగత కారణాలతో జట్టును వీడిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాకు వెళ్లిన అతడు తిరిగి ఎప్పుడు వస్తాడు అన్నదానిపై ఇప్పటి వరకు ఓ స్పష్టత లేదు.