Credit @ x.com
IND vs AUS 4th Test Day 1: టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. నిబంధనలు ఉల్లంఘించాడనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20 శాతం జరిమానాగా విధించింది. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది. గురువారం ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆటలో ఆసీస్ అరంగ్రేట ఆటగాడు సామ్ కొన్‌స్టాస్ ను కోహ్లీ భుజంతో ఢీ కొట్టాడు. దీనిపైనే ఐసీసీ సీరియస్ అయింది.
ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ పదో ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. సామ్ (60; 65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడుతుండడంతో అతడిని కవ్వించే ప్రయత్నం చేశాడు కోహ్లీ. ఈ ఓవర్ అనంతరం సామ్ నడుచుకుంటూ మరో ఎండ్‌కు వెలుతుండగా.. ఎదురుగా వెళ్లిన కోహ్లీ అతడి భుజాన్ని ఢీకొట్టాడు. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మరో ఆసీస్ ఆటగాడు ఉస్మాన్ ఖవాజాతో పాటు అంపైర్లు జోక్యం చేసుకోని వారిద్దరికి సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
IND vs AUS : బాక్సింగ్‌డే టెస్టు.. ముగిసిన తొలి రోజు ఆట.. భారీ స్కోరు దిశగా ఆస్ట్రేలియా..
అయితే.. కోహ్లీ రెచ్చగొట్టడంతో 11వ ఓవర్‌లో సామ్ చెలరేగిపోయాడు. బుమ్రా వేసిన ఈ ఓవర్‌లో 4,0, 2, 6, 4, 2 బాది 18 పరుగులు రాబట్టాడు.
కాగా.. 19 ఏళ్ల అరంగ్రేట ఆటగాడి పై కోహ్లీ వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అతడి తీరును ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లతో పాటు పలువురు విశ్లేషకులు తప్పుబట్టారు. కోహ్లీ ఉద్దేశ్యపూర్వకంగానే ఢీ కొట్టాడని ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మ్యాచ్ రిఫరీ ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలి రోజు ఆటముగిసే సమయానికి ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (68), పాట్ కమిన్స్ (8)లు క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు. ఆకాశ్ దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు తలా ఓ వికెట్ పడగొట్టాడు.
Cricket Viral Videos : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..
🚨 VIRAT KOHLI HAS BEEN FINED 20% OF HIS MATCH FEES…!!! 🚨 pic.twitter.com/UhQX85YWJf
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 26, 2024