Cricket Viral Videos : అరుదైన ఘటన.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. బౌలర్ చేతికి గాయం..
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL) 2024 సీజన్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది.

Ball Hits Roof in BBL 2024: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ (BBL) 2024 సీజన్‌లో ఓ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి స్టేడియం పై కప్పును తాకింది. అదే సమయంలో బౌలర్ చేతికి గాయమైంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బిగ్‌బాష్ లీగ్ 2024లో భాగంగా మెల్‌బోర్న్ రెనెగేడ్స్, పెర్త్ స్కార్చర్స్ జట్ల మధ్య సోమవారం మెల్‌బోర్న్‌లోని డాక్లాండ్స్ స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ ఇన్నింగ్స్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. పెర్త్ ఇన్నింగ్స్ 10వ ఓవర్‌ను కేన్ రిచర్డ్‌సన్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఐదో బంతిని పెర్త్ స్కార్చర్స్ బ్యాటర్ కూపర్ కొన్నోలీ షాట్ ఆడాడు. అయితే.. బంతి ఎడ్జ్ తీసుకుని అమాంతం అక్కడే గాల్లోకి పైకి లేచింది.
Manu Bhaker father : మను భాకర్ తండ్రి ఆవేదన.. తప్పు చేశాను.. షూటర్‌ను కాకుండా..
స్టేడియం పై కప్పును తాకింది. బాల్ కిందకు వస్తున్న సమయంలో బౌలర్ రిచర్డ్ సన్ క్యాచ్ అందుకునేందుకు ప్రయత్నం చేశాడు. దీంతో అతడి చేతికి గాయమైంది. బంతి స్టేడియం పై కప్పును తాకడంతో నిబంధనల ప్రకారం డెడ్‌బాల్‌గా ప్రకటించారు. ఆస్ట్రేలియాలో రూఫ్ టాప్ కలిగిన స్టేడియాల్లో డాక్లాండ్స్ స్టేడియం ఒకటి.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో పెర్త్ స్కార్చర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. పెర్త్ బ్యాటర్లలో కూపర్ కొన్నోలీ (66; 50 బంతుల్లో 1 ఫోర్, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. 144 పరుగుల లక్ష్యాన్ని మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మరో ఓవర్ మిగిలి ఉండగా 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రెనెగేడ్స్ బ్యాటర్లలో జాకబ్ బెథెల్ (30), టిమ్ సీఫెర్ట్ (28) లు రాణించారు.
IND vs AUS : నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బ్యాడ్‌న్యూస్..! ఆనందంలో భారత ఆటగాళ్లు..!
BALL HIT ON THE ROOF IN BIG BASH. 🤯 pic.twitter.com/RlS4qwq3u4
— Johns. (@CricCrazyJohns) December 23, 2024