Manu Bhaker father : మ‌ను భాక‌ర్ తండ్రి ఆవేద‌న‌.. త‌ప్పు చేశాను.. షూట‌ర్‌ను కాకుండా..

మ‌ను ను షూట‌ర్‌గా కాకుండా క్రికెట‌ర్‌ని చేసి ఉంటే బాగుండేద‌ని, అప్పుడు ప్ర‌శంస‌లు, అవార్డులు వ‌చ్చేవ‌ని మ‌ను తండ్రి రామ్‌ కిషన్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు.

Manu Bhaker father : మ‌ను భాక‌ర్ తండ్రి ఆవేద‌న‌.. త‌ప్పు చేశాను.. షూట‌ర్‌ను కాకుండా..

Manu Bhaker father breaks silence over shooters Khel Ratna snub

Updated On : December 24, 2024 / 1:06 PM IST

పారిస్ ఒలింపిక్స్ 2024లో రెండు కాంస్య ప‌త‌కాల‌ను సాధించింది భార‌త షూట‌ర్ మ‌ను భాక‌ర్‌. ఈ క్ర‌మంలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు ఒలింపిక్స్ ప‌త‌కాల‌ను సాధించిన తొలి భార‌త అథ్లెట్‌గా చ‌రిత్ర సృష్టించింది. ప్ర‌స్తుతం ఆమె పేరు మ‌రోసారి మారు మోగిపోతుంది. ఆమెకు దేశ అత్యున్న‌త క్రీడా పుర‌స్కారం ధ్యాన్ చంద్ ఖేల్ రత్న వ‌స్తుందా? రాదా? అన్న‌ది ప్ర‌స్తుతం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అవార్డు కోసం ఆన్‌లైన్ పోర్ట‌ల్‌లో త‌న పేరును స‌మ‌ర్పించాన‌ని, అయితే.. 30 పేర్లు గ‌ల షార్ట్ లిస్ట్‌లో త‌న‌ పేరు లేద‌ని మ‌ను పేర్కొంది. దేశ అత్యున్న‌త క్రీడా పుర‌స్కారానికి త‌న పేరును ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డంపై మ‌ను తీవ్ర నిరాశ‌కు గురైంది.

మ‌ను ను షూట‌ర్‌గా కాకుండా క్రికెట‌ర్‌ని చేసి ఉంటే బాగుండేద‌ని, అప్పుడు ప్ర‌శంస‌లు, అవార్డులు వ‌చ్చేవ‌ని మ‌ను తండ్రి రామ్‌ కిషన్ ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మ‌ను భాక‌ర్ తండ్రి మాట్లాడుతూ.. క్రీడా మంత్రిత్వ శాఖ‌, ఖేల్ ర‌త్న నామినీల జాబితాను ఖ‌రారు చేసిన క‌మిటీపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డాడు.

IND vs AUS : నాలుగో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు బ్యాడ్‌న్యూస్‌..! ఆనందంలో భార‌త ఆటగాళ్లు..!

ఒలింపిక్స్‌లో ఆడినా మ‌న దేశంలో విలువ ఉండదు. ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన‌ప్ప‌టికి ఖేల్‌రత్న పురస్కారానికి మనును పట్టించుకోవడం లేదు. నా బిడ్డ దేశం కోసం ఇంకా ఏమీ చేయాల‌ని మీరు ఆశిస్తున్నారు. ఆమెను షూటర్‌గా కాకుండా క్రికెట‌ర్‌ను చేసి ఉంటే బాగుండేది. అప్పుడు, ఆమెకు అన్ని అవార్డులు, ప్ర‌శంస‌లు వ‌చ్చేవి అని మ‌ను భాక‌ర్ తండ్రి అన్నాడు.

దేశం కోసం విజ‌యాలు సాధిస్తూ గుర్తింపు కోసం అడుక్కోవాల్సి రావ‌డంలో అర్థం లేద‌న్నారు. గత రెండు మూడు సంవ‌త్స‌రాలుగా మ‌ను ప‌ద్మ‌శ్రీ, ప‌ద్మ విభూష‌ణ్‌, ఖేల్ ర‌త్న వంటి పుర‌స్కారాల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంటూనే ఉంద‌న్నారు. త‌న వ‌ద్ద ఆధారాలు ఉన్నాయ‌న్నారు. ఆమె ద‌ర‌ఖాస్తు చేయ‌పోయినా, ఆమె సాధించిన ఘ‌న‌త‌లు చూసి క‌మిటీ ప్ర‌తిపాదించాల్సింది అని అన్నారు.

Mohammed Shami – Sania Mirza : మ‌హ్మ‌ద్ ష‌మీ, సానియా మీర్జాలు పెళ్లి చేసుకున్నారా? ఫోటోలు వైర‌ల్‌.. అస‌లు నిజం ఇదే..

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రహ్మణ్యం నేతృత్వంలోని 12 మంది సభ్యుల సెలక్షన్‌ కమిటీ అర్జున, ఖేల్‌రత్న, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ తదితర అవార్డులకు సంబంధించిన నామినేషన్ల జాబితాను ప్రభుత్వానికి అందించింది. ఇందులో మ‌ను భాక‌ర్ పేరు లేన‌ట్లుగా తెలుస్తోంది.