Mohammed Shami – Sania Mirza : మహ్మద్ షమీ, సానియా మీర్జాలు పెళ్లి చేసుకున్నారా? ఫోటోలు వైరల్.. అసలు నిజం ఇదే..
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ, భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి.

Viral Photo Of Sania Mirza And Shami Sparks Rumors Heres The Truth
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ షమీ, భారత మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు పెళ్లి చేసుకున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసిన కొందరు వారిద్దరు నిజంగానే పెళ్లి చేసుకున్నారు అని అనుకుంటున్నారు. అయితే.. ఇందులో ఎంత మాత్రం నిజం లేదు. అవి నిజమైన ఫోటోలు కావు. ఏఐ టెక్నాలజీ సాయంతో వారిద్దరికి పెళ్లి చేశారు. ఏఐ టెక్నాలజీతో ఉపయోగించి పెళ్లి ఫోటోలను రూపొందించి వాటిని వైరల్ చేస్తున్నారు కొందరు ఆకతాయిలు.
వాస్తవానికి పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌తో విడాకులు తీసుకున్న తరువాత సానియా మీర్జా తన కుమారుడితో కలిసి దుబాయ్‌లో నివసిస్తోంది. తన స్నేహితులతో కలిసి తన సమయాన్ని గడుపుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమె తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. మరోవైపు షమీ సైతం తన సతీమణి హసీన్ జహాన్‌కు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు.
Batter of the year : 2024లో బెస్ట్ బ్యాట్స్‌మెన్స్ ఎవరు? కోహ్లీ, రోహిత్ శర్మలు కానే కాదు..
గాయం నుంచి కోలుకున్న షమీ ఇటీవలే దేశవాలీ టోర్నీలు ఆడాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి షమీ వెళ్లే అవకాశాలు లేకపోవడంతో అతడు దుబాయ్ వెళ్లాడని, అక్కడ సానియాతో కలిసి షికార్లు చేస్తున్నాడని, ఈ క్రమంలో వారిద్దరు పెళ్లి చేసుకున్నారని, ఇందుకు ఈ ఫోటోలే సాక్ష్యం అని.. ఏఐ టెక్నాలజీ ఉపయోగించి రూపొందించిన ఫోటోలను పోస్ట్ చేస్తూ ప్రచారం చేస్తున్నారు.
mohammed shami and sania mirza beautiful picture 🤪 Congratulations Shami Brother ♥️ pic.twitter.com/9b9idU1jA1
— 🕊️🦋Mehwish Khan 🦋🕊️ (@_Mehwish_khan) December 23, 2024
అయితే.. ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఓ వార్త వైరల్‌గా మారింది. అప్పుడు సానియా మీర్జా తండ్రి ఇమ్రాన్ మీర్జా వీటిపై స్పందించారు. అవన్నీ రూమర్లే అని కొట్టిపారేశాడు. ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదన్నాడు. అసలు సానియా మీర్జా ఒక్కసారి కూడా షమీని కలిసింది లేదన్నాడు. ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్న వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహ్మద్ షమీ సైతం సానియాతో పెళ్లి వార్తలపై గతంలోనే స్పందించాడు. వీటిపై అసహనం వ్యక్తం చేశాడు. ఆ వార్తల్లో నిజం లేదన్నాడు. ఇలాంటి వాటిని ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. ఏదైన వార్త షేర్ చేసే ముందు అందులో ఎంత నిజం ఉందో తెలుసుకోవాలని సూచించాడు.