Batter of the year : 2024లో బెస్ట్ బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు? కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు కానే కాదు..

ఈ ఏడాది క్రికెట్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఎవ‌రిని ఎంచుకుంటారు అనే ప్ర‌శ్న టీమ్ఇండిమా మాజీ ఆట‌గాడు పార్థివ్ ప‌టేల్‌కు ఎదురైంది

Batter of the year : 2024లో బెస్ట్ బ్యాట్స్‌మెన్స్ ఎవ‌రు? కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు కానే కాదు..

Parthiv Patel picks the best batsman of 2024

Updated On : December 23, 2024 / 3:52 PM IST

ఈ ఏడాది టెస్టుల్లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు య‌శ‌స్వి జైస్వాల్‌, ఇంగ్లాండ్ స్టార్ ఆట‌గాళ్లు జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్ డ‌కెట్‌, శ్రీలంక ఆట‌గాడు క‌మిందు మెండిస్‌లు అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశారు. వీరిలో ఈ ఏడాది క్రికెట్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా ఎవ‌రిని ఎంచుకుంటారు అనే ప్ర‌శ్న టీమ్ఇండిమా మాజీ ఆట‌గాడు పార్థివ్ ప‌టేల్‌కు ఎదురైంది.

జోరూట్ విష‌యానికి వ‌స్తే.. 29 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 56 స‌గ‌టుతో 1470 ప‌రుగులు చేశాడు. య‌శ‌స్వి జైస్వాల్ 25 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 54 స‌గ‌టుతో 1304 ప‌రుగులు చేశాడు. బెన్ డ‌కెట్ 30 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 30 స‌గ‌టుతో 1134 ప‌రుగులు చేయ‌గా, హ్యారీ బ్రూక్ 18 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 60 స‌గ‌టుతో 1099 ప‌రుగులు చేశాడు. ఇక లంక ఆట‌గాడు క‌మిందు మెండీస్ 10 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 74 స‌గ‌టుతో 1049 ప‌రుగులు సాధించాడు.

వీరిలో య‌శ‌స్వి జైస్వాల్‌ను టెస్టు క్రికెట‌ర్ ఆఫ్ ది ఇయ‌ర్‌గా పార్థివ్ ప‌టేల్ ఎన్నుకున్నాడు. అదే స‌మ‌యంలో లంక ఆట‌గాడు క‌మింద్ మెండీస్ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు. అదే స‌మ‌యంలో బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్ లు అద్భుతంగా ఆడార‌ని కితాబు ఇచ్చాడు.

Harmanpreet Kaur : హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్ స్ట‌న్నింగ్ క్యాచ్‌.. గాల్లోకి ఎగిరి ఒంటి చేత్తో..

య‌శ‌స్వి జైస్వాల్ భార‌త ఆట‌గాడు అన్న కార‌ణంతో తాను ఎన్నుకోలేద‌ని పార్థివ్ ప‌టేల్ చెప్పుకొచ్చాడు. చాలా మంది ఇతర ఆటగాళ్లు ఒకే స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తారు. కానీ య‌శ‌స్వి అలా కాద‌న్నాడు. ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఓ సారి వేగంగా మ‌రోసారి నిదానంగా ప‌రుగులు సాధిస్తాడ‌ని తెలిపాడు.

ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత‌డి బ్యాటింగ్ తీరే అందుకు ఊదాహ‌ర‌ణ అన్నాడు. ఓ టెస్టు మ్యాచులో జిమ్మీ అండ‌ర్స‌న్ అద్భుతంగా బౌలింగ్ చేశాడ‌ని, ఆ స‌మ‌యంలో య‌శ‌స్వి ఎంతో ఓపిక‌గా బ్యాటింగ్ చేశాడ‌ని, ఆ త‌రువాత‌ అద్భుత‌మైన షాట్లు ఆడుతూ డ‌బుల్ సెంచ‌రీ చేశాడ‌ని అన్నాడు. ఇక సిన్న‌ర్లు బౌలింగ్ వ‌స్తే అత‌డి బ్యాటింగ్ విధానమే మారిపోతుంద‌ని చెప్పాడు.

ఇక బంగ్లాదేశ్‌తో కాన్పూర్ వేదిక‌గా జ‌రిగిన టెస్టు మ్యాచ్‌ మ‌రో ఊదాహ‌ర‌ణ‌. అప్పుడు వ‌ర్షం కార‌ణంగా మూడు రోజుల ఆట‌ను న‌ష్ట‌పోయాం. ఆ స‌మ‌యంలో టీమ్ఇండియా వేగంగా బ్యాటింగ్ చేయాల‌ని అనుకుంది. జైస్వాల్ మంచి స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేశాడు. అదే బంగ్లాదేశ్‌తో చెన్నైతో జ‌రిగిన టెస్టు మ్యాచ్ ఇంకో ర‌కంగా బ్యాటింగ్ చేశాడ‌ని గుర్తు చేసుకున్నాడు.

Sanju Samson : సంజూ శాంస‌న్ కీల‌క నిర్ణ‌యం.. ఐపీఎల్ 2025లో మార‌నున్న రోల్‌!

స్వదేశంలో కాదు విదేశాల్లో అత‌డి ఆట అద్భుతం అని చెప్పాడు. ఆస్ట్రేలియాలో కండిష‌న్లు చాలా క‌ఠినంగా ఉంటాయ‌ని, ముఖ్యంగా పెర్త్‌లో బ్యాటింగ్ చేయ‌డం చాలా క‌ష్ట‌మ‌న్నాడు. అలాంటి చోట రెండో ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్‌, పాట్ క‌మిన్స్‌ల‌ను ఎదుర్కొంటూ య‌శ‌స్వి భారీ శ‌త‌కంతో రాణించాడు. ఫార్మాట్‌ల‌తో పాటు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లుగా ఆడ‌డమే య‌శ‌స్విలో ఉన్న సామ‌ర్థ్యం అని చెప్పారు. అందుక‌నే అత‌డిని 2024 సంవ‌త్స‌రానికి ఉత్త‌మ బ్యాట‌ర్‌గా ఎన్నుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.