IPL 2023: ఈడెన్ గార్డెన్స్‌లో కోహ్లీకి డ్యాన్స్ నేర్పిన షారుక్‌.. పఠాన్ సినిమా పాటతో హోరెత్తిన మైదానం.. వీడియో వైరల్

ఆర్సీబీపై విజయం సాధించిన తరువాత కేకేఆర్ జట్టు సభ్యులను అభినందించేందుకు షారుక్ మైదానంలోకి వచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీని చూసి షారుక్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమురుతూ సరదాగా ఆటపట్టించాడు.

Virat Kohli and Shah Rukh Khan pathaan movie step ( Images_ Twitter)

IPL 2023: ఐపీఎల్- 2023 టోర్నీలో భాగంగా గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో శార్దూల్ ఠాకూర్ వీరవిహారం చేయడంతో కేకేఆర్ జట్టు 81 పరుగుల తేడాతో ఆర్‌సీబీ జట్టుపై ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు కోల్‌కతా నైట్ రైడర్స్ సహ యాజమాని, బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్‌ ఖాన్ వచ్చారు. తన కుమార్తె సహానా ఖాన్ కూడా షారూఖ్‌తో ఉన్నారు. మ్యాచ్ జరుగుతున్నంత వీరు కేకేఆర్ జట్టుకు మద్దతుగా సందడి చేశారు.

Virat Kohli and Shah Rukh Khan pathaan movie step ( Images_ Twitter)

ఆర్సీబీపై విజయం సాధించిన తరువాత కేకేఆర్ జట్టు సభ్యులను అభినందించేందుకు షారూక్ మైదానంలోకి వచ్చారు. ఈ క్రమంలో కోహ్లీని చూసి షారూక్ ఉత్సాహంగా పరుగెత్తుకుంటూ వెళ్లి కౌగిలించుకున్నాడు. బుగ్గలు నిమురుతూ సరదాగా ఆటపట్టించాడు. మైదానంలోనే ఒకరినొకరు సరదాగా మాట్లాడుకుంటూ కొద్దిసేపు సందడి చేశారు. కోహ్లీ, షారూక్ మాట్లాడుకుంటుండగా షారూక్, కోహ్లీ అంటూ ప్రేక్షకుల నినాదాలతో  స్టేడియం దద్దరిల్లిపోయింది.

 

 

ఇటీవల షారూక్ ఖాన్ పఠాన్ సినిమా విడులైన విషయం విధితమే. వరల్డ్ వైడ్‌గా అధ్భుత విజయాన్ని అందుకుంది. ఇందులోని ‘జూమ్ జో పఠాన్’ పాట మంచి ఆదరణ పొందింది. ఈ పాటకు కోహ్లీ, షారూక్ డ్యాన్స్ చేయసాగారు. ఈక్రమంలో షారూక్ ఖాన్ కోహ్లీకి సెప్టులు ఎలా వేయాలో నేర్పించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.