Virat Kohli : ఇంగ్లాండ్ పై సిరీస్ విజ‌యం.. కోహ్లి పోస్ట్ వైర‌ల్‌

టీమ్ఇండియా సిరీస్ గెల‌వ‌డం పై స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు.

Kohli Social Media Post After India Serie Win Over England

Virat Kohli – Team India : రాంచీ వేదిక‌గా ఇంగ్లాండ్‌తో జ‌రిగిన నాలుగో టెస్టు మ్యాచ్‌లో భార‌త్ ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలో మ‌రో మ్యాచ్ మిగిలి ఉండ‌గానే ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. ప్ర‌స్తుతం సిరీస్‌లో భార‌త్ 3-1 ఆధిక్యంలో ఉంది. చివ‌రి మ్యాచ్ ధ‌ర్మ‌శాల వేదిక‌గా మార్చి 7 నుంచి జ‌ర‌గ‌నుంది.

ఉత్కంఠభరితంగా సాగిన రాంచీ మ్యాచ్‌లో భార‌త్‌ అన్ని విభాగాల్లో రాణించింది. స్వల్ప లక్ష్య ఛేదనలో తడబాటుకు లోనైనప్పటికీ ఆ తర్వాత కుదురుకుని చిరస్మరణీయ విజయం సాధించింది. విరాట్ కోహ్లి, బుమ్రా, ష‌మీ, కేఎల్ రాహుల్ వంటి ఆట‌గాళ్లు లేక‌పోయినా టీమ్ఇండియా అద్భుతంగా ఆడింది. కాగా.. టీమ్ఇండియా సిరీస్ గెల‌వ‌డం పై టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లి సోష‌ల్ మీడియా వేదిక‌గా స్పందించాడు.

వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు కోహ్లి దూరంగా ఉన్నాడు. అత‌డి భార్య అనుష్క శ‌ర్మ ఇటీవ‌ల పండంటి మ‌గ‌బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. ఆ చిన్నారికి అకాయ్ అని పేరు పెట్టారు. ప్ర‌స్తుతం త‌న కుటుంబ స‌భ్యుల‌తో గ‌డ‌పాల‌ని కోహ్లి భావిస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే ఆట‌కు దూరంగా ఉన్నాడు. కాగా.. టీమ్ఇండియా చారిత్రాత్మ‌క విజ‌యం సాధించ‌డం ప‌ట్ల కోహ్లి ఆనందాన్ని వ్య‌క్తం చేశాడు.

Hanuma Vihari: ఇకపై ఆంధ్రా జట్టు తరఫున ఆడ‌ను.. సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టిన హ‌నుమ విహారి

“అవును!!! మా యువ జట్టు అద్భుత సిరీస్ విజయం సాధించింది. దృఢనిశ్చయం, సంకల్పం, పునరుద్ధరణను చూపించింది.” అని విరాట్ కోహ్లి ఎక్స్ (గ‌తంలో ట్విట్ట‌ర్ అని పిలిచేవారు) లో పోస్ట్ చేశాడు. ఇది వైర‌ల్‌గా మారింది.

కాగా.. భార‌త్‌కు స్వ‌దేశంలో వ‌రుస‌గా ఇది 17వ సిరీస్ విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం. 2012లో అలిస్ట‌ర్ కుక్ నాయ‌క‌త్వంలోని ఇంగ్లాండ్‌తో భార‌త్ 2-1తేడాతో సిరీస్ కోల్పోయింది. ఆ త‌రువాత నుంచి జ‌రిగిన సిరీస్‌ల్లో ఒక్క‌దానిలోనూ భార‌త్ ఓడిపోలేదు. అన్నింటిలో జ‌య‌కేత‌నం ఎగుర‌వేసింది.

Hardik Pandya : హార్దిక్ పాండ్య వ‌చ్చేశాడు.. నాలుగు నెల‌ల త‌రువాత పోటీ క్రికెట్‌లో..

రాంచీ టెస్టు మ్యాచ్ విష‌యానికి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 353 ప‌రుగులు చేసింది. అనంత‌రం భార‌త్ 307 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌కు 46 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం ల‌భించింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 145 ప‌రుగుల‌కే కుప్ప‌కూలడంతో భార‌త్ ముందు 192 ప‌రుగుల ల‌క్ష్యం నిలిచింది. ​కెప్టెన్ రోహిత్ శర్మ (81 బంతుల్లో 55), యశస్వి జైస్వాల్ (44 బంతుల్లో 37) ల‌తో పాటు శుభ్‌మన్ గిల్ (52 నాటౌట్), ధ్రువ్ జురెల్ (39 నాటౌట్) రాణించ‌డంతో భార‌త్ ఐదు వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు