Hanuma Vihari: ఇకపై ఆంధ్రా జట్టు తరఫున ఆడ‌ను.. సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టిన హ‌నుమ విహారి

టీమ్ఇండియా టెస్టు ఆట‌గాడు, ఆంధ్రా మాజీ కెప్టెన్ హ‌నుమ విహారి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు.

Hanuma Vihari: ఇకపై ఆంధ్రా జట్టు తరఫున ఆడ‌ను.. సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టిన హ‌నుమ విహారి

Hanuma Vihari

Vihari : టీమ్ఇండియా టెస్టు ఆట‌గాడు, ఆంధ్రా మాజీ కెప్టెన్ హ‌నుమ విహారి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నాడు. ఇక పై తాను ఎప్పుడూ కూడా ఆంధ్రా జ‌ట్టు త‌రుపున ఆడ‌న‌ని చెప్పాడు. రంజీట్రోఫ్రీ 2023-24లో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌తో జ‌రిగిన క్వార్ట‌ర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆంధ్రా నాలుగు ప‌రుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఈ సీజ‌న్‌లో ఆంధ్రా ప్ర‌యాణం ముగిసిన అనంత‌రం విహారి సంచ‌ల‌న విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టాడు.

ఈ సీజ‌న్‌లో మొద‌టి మ్యాచులో కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించిన తాను ఎందుకు రాజీనామా చేశాను అన్న విష‌యాల‌ను తెలియ‌జేశాడు. ఓ రాజ‌కీయ నాయ‌కుడి కుమారుడి పై అరిచినందుకు త‌న కెప్టెన్సీని వ‌ద‌లుకోవాల్సి వ‌చ్చింద‌న్నాడు.

Also Read : అయ్యో రోహిత్‌.. ఇలా ఔట్ అయిపోయావు.. కెప్టెనే ఇలా ఆడితే..

‘బెంగాల్‌తో జరిగిన మొదటి గేమ్‌లో నేను కెప్టెన్‌గా ఉన్నాను. ఆ గేమ్‌లో నేను 17వ ఆటగాడిపై అరిచాను. అతడు తన తండ్రికి ఫిర్యాదు చేశాడు. అతని తండ్రి ప్రతిగా నాపై చర్య తీసుకోవాలని అసోసియేషన్‌ను కోరారు. గ‌తేడాది ఫైన‌ల్‌కు చేరిన బెంగాల్

ఆట‌పై ఉన్న ప్రేమ‌, జ‌ట్టును గౌర‌వించ‌డంతోనే ఈ సీజ‌న్‌లో కొన‌సాగిన‌ట్లు వివ‌రించాడు. ‘విచారకరమైన భాగం ఏమిటంటే ఆటగాళ్ళు తాము ఏది చెప్పినా వినాలని అసోసియేషన్ భావిస్తుంది. కానీ నేను ఈ రోజు వరకు దానిని బయటపెట్టలేదు. నా ఆత్మగౌరవాన్ని కోల్పోయాను. అందుక‌నే ఆంధ్రా తరఫున ఎప్పటికీ ఆడకూడదని నిర్ణయించుకున్నాను. నేను జట్టును ఎప్ప‌టికీ ప్రేమిస్తాను.’అని విహారి అన్నాడు.

జట్టు సభ్యుడి పేరును విహారి వెల్లడించకపోగా.. వికెట్ కీపర్ బ్యాటర్ కెఎన్ పృధ్వీరాజ్ (Kuntrapakam Prudhviraj) సోషల్ మీడియాలో స్పందించాడు. “మీరు ఆ కామెంట్ బాక్స్‌లో వెతుకుతున్న వ్యక్తిని నేను. మీరు ఏది విన్నా అది పూర్తిగా అబద్ధం. ఆట కంటే ఎవ్వరూ గొప్పవారు కాదు. నా ఆత్మగౌరవం చాలా పెద్దది. వ్యక్తిగత దాడులు, అసభ్య పదజాలం ఏ వేదికలోనూ ఆమోదయోగ్యం కాదు. ఆ రోజు ఏం జరిగిందో టీమ్‌లోని అందరికీ తెలుసు. మీకు కావాలంటే ఈ సానుభూతి గేమ్‌లను ఆడండి.” అని పృధ్వీరాజ్ రాసుకొచ్చాడు. కాగా.. పృధ్వీరాజ్ ఇంకా ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేయలేదు.

Also Read: రాంచీ టెస్టులో ఘ‌న విజ‌యం.. ప్ర‌పంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భార‌త స్థానం మ‌రింత ప‌దిలం