Virat Kohli : విరాట్ కోహ్లీ అరుదైన రికార్డు.. భార‌త్ త‌రుపున అత్య‌ధిక మ్యాచులు ఆడిన రెండో ప్లేయ‌ర్‌గా..

టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

Kohli surpasses Dhoni to become India second most capped player

Virat Kohli : టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు. అంత‌ర్జాతీయ క్రికెట్ లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక మ్యాచులు ఆడిన రెండో ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు. ఈ క్ర‌మంలో దిగ్గ‌జ ఆట‌గాడు ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లీ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో (అన్ని ఫార్మాట్ల‌లో) టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక మ్యాచులు ఆడిన రికార్డు దిగ్గ‌జ ఆట‌గాడు స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉంది. స‌చిన్ 1989 నుంచి 2013 వ‌ర‌కు భార‌త్‌కు ప్రాతినిధ్యం వ‌హించాడు. టెస్టులు, వ‌న్డేలు, టీ20లు క‌లిపి మొత్తం 664 మ్యాచులు ఆడాడు. బెంగ‌ళూరు టెస్టుతో క‌లిపి కోహ్లి 536 మ్యాచులు ఆడాడు.

Virat Kohli : 8 ఏళ్ల త‌రువాత వ‌న్‌డౌన్‌లో వ‌చ్చిన కోహ్లీ.. మ‌రోసారి విఫ‌లం..

ఇక ఎంఎస్ ధోని విష‌యానికి వ‌స్తే.. ధోని 2004 నుంచి 2019 వ‌ర‌కు భార‌త్‌కు ఆడిన ధోని 535 మ్యాచులు ఆడాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా రాహుల్ ద్ర‌విడ్‌, రోహిత్ శ‌ర్మ లు ఉన్నారు.

భార‌త్ త‌రుపున అంత‌ర్జాతీయ క్రికెట్‌లో అత్య‌ధిక మ్యాచులు ఆడిన ప్లేయ‌ర్లు..
* స‌చిన్ టెండూల్క‌ర్ – 664 మ్యాచులు
* విరాట్ కోహ్లీ – 536 మ్యాచులు
* ఎంఎస్ ధోని – 535 మ్యాచులు
* రాహుల్ ద్ర‌విడ్ – 504 మ్యాచులు
* రోహిత్ శ‌ర్మ – 486 మ్యాచులు

IND vs NZ : న్యూజిలాండ్‌తో తొలి టెస్టు.. శుభ్‌మ‌న్ గిల్ ఎందుకు ఆడ‌డం లేదో తెలుసా?

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. బెంగ‌ళూరు వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లీ డ‌కౌట్ అయ్యాడు. కోహ్లీతో పాటు రోహిత్ శ‌ర్మ (2), య‌శ‌స్వి జైస్వాల్ (13), స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (0), కేఎల్ రాహుల్ (0), ర‌వీంద్ర జడేజా (0) లు విఫ‌లం కావ‌డంతో లంచ్ విరామానికి భార‌త్ 34 ప‌రుగుల‌కే ఆరు వికెట్లు కోల్పోయి భార‌త్ క‌ష్టాల్లో ప‌డింది.