Laura Wolvaardt shatters all time Womens World Cup record as captain
Laura Wolvaardt : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ మహిళల వన్డే ప్రపంచకప్ 2025 సెమీస్ మ్యాచ్‌లో అదరగొట్టింది. గౌహతి వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారీ శతకంతో చెలరేగింది. ఈ మ్యాచ్‌లో 143 బంతులు ఎదుర్కొన్న లారా 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 169 పరుగులు చేసింది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్ లో సెంచరీ సాధించిన తొలి దక్షిణాఫ్రికా ఆమె చరిత్ర సృష్టించింది.
అంతేకాదండోయ్.. ఓ వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు సాధించిన కెప్టెన్‌గా రికార్డులకు ఎక్కింది. ఈ క్రమంలో ఆసీస్ మాజీ కెప్టెన్ బెలిండా క్లార్క్‌ను అధిగమించింది. క్లార్క్ 1997 వన్డే ప్రపంచప్ లో 5 ఇన్నింగ్స్‌ల్లో 445 పరుగులు సాధించింది. ఇక లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) విషయానికి వస్తే.. తాజా ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో 470 పరుగులు సాధించింది.
మహిళల వన్డే ప్రపంచకప్‌లలో ఓ ఎడిషన్‌లో కెప్టెన్‌గా అత్యదిక పరుగులు సాధించిన ప్లేయర్లు వీరే..
లారా వోల్వార్డ్ట్ (దక్షిణాఫ్రికా) – 470 పరుగులు (8 ఇన్నింగ్స్‌లలో 2025లో)
బెలిండా క్లార్క్ (ఆస్ట్రేలియా) – 445 పరుగులు (5 ఇన్నింగ్స్‌లలో 1997లో)
మిథాలీ రాజ్ (భారత్) – 409 పరుగులు (9 ఇన్నింగ్స్‌లలో 2017లో)
సుజీ బేట్స్ (న్యూజిలాండ్) – 407 (7 ఇన్నింగ్స్‌లలో 2013లో)
మెగ్ లానింగ్ (ఆస్ట్రేలియా) – 394 పరుగులు (9 ఇన్నింగ్స్‌లలో 2022లో)
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగులు సాధించింది. సఫారీ బ్యాటర్లలో లారా వోల్వార్డ్ట్ (169) భారీ సెంచరీ సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్లలో సోఫీ ఎక్లెస్టోన్ నాలుగు వికెట్లు తీసింది.
Shreyas Iyer : ప్రాణాంతక గాయంపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్.. ‘రోజు రోజుకు నేను.. ‘
అనంతరం 320 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లీష్ బ్యాటర్లలో నాట్ స్కైవర్-బ్రంట్ (64), ఆలిస్ క్యాప్సే (50)లు రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మారిజాన్ కాప్ ఐదు వికెట్లు తీసింది.