Dr Vece Paes : టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం.. ఆయ‌న తండ్రి, మాజీ హాకీ ఆట‌గాడు వేస్‌ పేస్ క‌న్నుమూత‌

భార‌త టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి వేస్‌ పేస్ (Dr Vece Paes) కన్నుమూశారు.

Leander Paes father Dr Vece Paes passedaway

Dr Vece Paes : భార‌త టెన్నిస్ దిగ్గ‌జం లియాండ‌ర్ పేస్ ఇంట్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆయ‌న తండ్రి, భార‌త మాజీ హాకీ ఆట‌గాడు వేస్‌ పేస్ (Dr Vece Paes) కన్నుమూశారు. గ‌తకొంత‌కాలంగా వృద్ధాప్య స‌మ‌స్య‌ల‌తో ఆయ‌న బాధ‌ప‌డుతున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న్ను కుటుంబ స‌భ్యులు ఆగ‌స్టు 12న కోల్‌క‌తాలోని ఓ ప్రైవేటు ఆస్ప‌త్రిలో చేర్పించారు. అక్క‌డ‌ చికిత్స పొందుతూ.. ఆరోగ్యం పూర్తిగా క్షీణించ‌డంతో గురువారం ఆయ‌న క‌న్నుమూశారు. ఆయ‌న వ‌య‌స్సు 80 సంవ‌త్స‌రాలు.

1945లో గోవాలో జ‌న్మించారు వేస్‌పేస్‌. హాకీలో మిడ్‌ఫీల్డ‌ర్‌గా అద్భుత నైపుణ్యాలు ప్ర‌ద‌ర్శించారు. 1972 ఒలింపిక్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించిన హాకీ జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్నారు. క్రీడ‌ల్లో రాణిస్తూనే ఆయ‌న మెడిసిన్ చ‌దివారు. హాకీ నుంచి రిటైర్ అయిన త‌రువాత త‌న జీవితాన్ని వైద్య‌రంగానికి అంకితం చేశారు.

Sanju Samson trade : సంజూ శాంస‌న్‌ను మీకిస్తాం.. అశ్విన్ వ‌ద్దుగానీ.. జ‌డేజాతో పాటు మ‌రోస్టార్ ఆట‌గాడిని ఇవ్వండి.. రాజ‌స్థాన్ డిమాండ్ ?

ఒలింపిక్ ప‌త‌కాలు సాధించిన తండ్రీకుమారులుగా రికార్డు..

మ‌న‌దేశ క్రీడా చ‌రిత్ర‌లో ఒలింపిక్ ప‌త‌కాలు సాధించిన తండ్రీకుమారులుగా వేస్‌పేస్‌, లియాండ‌ర్ పేస్‌లు ఘ‌న‌త సాధించారు. హాకీలో వేస్ కాంస్య ప‌త‌కం ద‌క్కించుకోగా, లియాండ‌ర్ పేస్ 1996 ఒలింపిక్స్‌లో టెన్నిస్ సింగిల్స్‌లో కాంస్య ప‌త‌కం సాధించాడు.