Mike Procter : క్రికెట్ ప్ర‌పంచంలో పెను విషాదం.. దిగ్గజ ఆట‌గాడు కన్నుమూత

క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది.

Mike Procter

South Africa all rounder Mike Procter : క్రికెట్ ప్ర‌పంచంలో విషాదం చోటు చేసుకుంది. ద‌క్షిణాఫ్రికా దిగ్గ‌జ ఆట‌గాడు మైక్‌ ప్రోక్టర్ క‌న్నుమూశాడు. ఆయ‌న వ‌య‌స్సు 77 సంవ‌త్సారాలు. దిగ్గ‌జ ఆట‌గాళ్ల‌లో ఒక‌డిగా పేరుగాంచిన ప్రోక్ట‌ర్ మ‌ర‌ణ‌వార్తతో ద‌క్షిణాఫ్రికా క్రికెట్‌లో విషాదం నెల‌కొంది. కొన్నాళ్ల క్రితం అత‌డి గుండెకు స‌ర్జ‌రీ జ‌రిగింది. అయితే.. శ‌స్త్ర‌చికిత్స అనంత‌రం త‌లెత్తిన స‌మ‌స్య‌ల‌తో అత‌డు మ‌ర‌ణించాడు.

మీడియం పేస‌ర్ అయిన ప్రోక్ట‌ర్ ద‌క్షిణాఫ్రికా త‌రుపున ఏడు టెస్టు మ్యాచులు మాత్ర‌మే ఆడాడు. ఆ మ్యాచ్‌లు అన్నీ ఆస్ట్రేలియాపైనే ఆడ‌డం గ‌మ‌నార్హం. ఏడు మ్యాచుల్లో 41 వికెట్లు తీశాడు. బ్యాటింగ్‌లో 25.1 స‌గ‌టుతో 226 ప‌రుగులు చేశాడు. అంత‌ర్జాతీయ క్రికెట్‌ పెద్ద‌గా ఆడ‌కున్నా కూడా ఫ‌స్ట్‌క్లాస్ క్రికెట్‌లో అద్భుత‌మైన రికార్డు క‌లిగి ఉన్నాడు.

Ravichandran Ashwin : శుభ‌వార్త‌.. అశ్విన్ వ‌చ్చేస్తున్నాడు

401 ఫ‌స్ట్‌క్లాస్ మ్యాచుల్లో 21,936 ప‌రుగులు చేశాడు. ఇందులో 48 సెంచ‌రీలు ఉన్నాయి. బౌలింగ్‌లో 1,417 వికెట్లు ప‌డ‌గొట్టాడు. 70 సార్లు ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో ఆరు వరుస సెంచరీలు చేసిన ఆట‌గాడి రికార్డు ప్రోక్టర్‌ పేరిటే ఉంది. రొడేషియా త‌రుపున 1970లో అత‌డు ఈ ఘ‌న‌త సాధించాడు.

క్రికెట్ కెరీర్ ముగిసిన త‌రువాత కూడా ఆట‌తోనే ప్రోక్ట‌ర్ అనుబంధం కొన‌సాగింది. మ్యాచ్ రిఫ‌రీగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించాడు. ప‌లు వివాదాల్లోనూ నిలిచాడు. 2006లో పాకిస్తాన్ జ‌ట్టు బాల్ టాంప‌రింగ్‌కు పాల్ప‌డింద‌నే కార‌ణంతో జ‌రిమానా విధించాడు. ఇక 2008లో సిడ్నీ టెస్టు మ్యాచ్‌లో మంకీగేట్ వివాదంలో భార‌త ఆట‌గాడు హ‌ర్భ‌జ‌న్ సింగ్ పై మూడు టెస్టు మ్యాచుల నిషేదం విధించింది ఆ మ్యాచ్‌కు రిఫ‌రీగా వ్య‌వ‌హ‌రించిన ప్రోక్ట‌రే.

Shubman Gill : అయ్యో గిల్‌.. కుల్దీప్ ఎంత ప‌ని చేశావ‌య్యా..

మ్యాచ్ రిఫ‌రీగా వైదొలిగిన త‌రువాత జాతీయ జ‌ట్టుకు చీఫ్ సెల‌క్ట‌ర్‌గా కూడా ప‌ని చేశాడు.

ట్రెండింగ్ వార్తలు