Ravichandran Ashwin : శుభ‌వార్త‌.. అశ్విన్ వ‌చ్చేస్తున్నాడు

భార‌త జ‌ట్టుకు శుభవార్త ఇది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో టెస్ట్ మ్యాచ్ మ‌ధ్య‌లోనే ఇంటికి వెళ్లి పోయిన సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ జ‌ట్టుతో చేర‌నున్నాడు.

Ravichandran Ashwin : శుభ‌వార్త‌.. అశ్విన్ వ‌చ్చేస్తున్నాడు

Ravichandran Ashwin

Ashwin : భార‌త జ‌ట్టుకు శుభవార్త ఇది. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో టెస్ట్ మ్యాచ్ మ‌ధ్య‌లోనే ఇంటికి వెళ్లి పోయిన సీనియ‌ర్ ఆట‌గాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్ జ‌ట్టుతో చేర‌నున్నాడు. అత‌డు ఈరోజు (ఆదివారం ఫిబ్ర‌వ‌రి 18)మ‌ధ్యాహ్నాం లంచ్ స‌మ‌యానికి జ‌ట్టుతో క‌ల‌వ‌నున్నాడు అని భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) వెల్ల‌డించింది.

రాజ్‌కోట్ వేదిక‌గా భార‌త్, ఇంగ్లాండ్ జ‌ట్లు మూడో టెస్టు మ్యాచ్‌లో త‌ల‌ప‌డుతున్నాయి. రెండో రోజు ఆట ముగిసిన త‌రువాత అశ్విన్ కుటుంబంలో మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా చెన్నైకి వెళ్లాడు. అత‌డి త‌ల్లి ఆరోగ్యం స‌రిగ్గా లేద‌ని, ఆమెను చూసేందుకే అత‌డు చెన్నై వెళ్లాడు.

Shubman Gill : అయ్యో గిల్‌.. కుల్దీప్ ఎంత ప‌ని చేశావ‌య్యా..

కాగా.. మూడో రోజు ఆట‌కు అశ్విన్ దూరం కావ‌డంతో భార‌త్ న‌లుగురు బౌల‌ర్ల‌తోనే ఆడింది. అయితే.. మిగిలిన బౌల‌ర్లు అద్భుతంగా బౌలింగ్ చేయ‌డంతో ఇంగ్లాండ్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 319 ప‌రుగుల‌కే క‌ట్ట‌డి చేశారు. దీంతో భార‌త్‌కు 126 ప‌రుగుల మొద‌టి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీశాడు. జ‌డేజా రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బుమ్రా ఓ వికెట్ సాధించాడు. కాగా..రెండో రోజు ఆట‌లో అశ్విన్ ఒక వికెట్ తీసిన సంగ‌తి తెలిసిందే. అశ్విన్ టెస్టు కెరీర్‌లో ఇది 500వ వికెట్. భార‌త క్రికెట్ చ‌రిత్ర‌లో టెస్టుల్లో ఐదు వంద‌ల వికెట్లు తీసిన రెండ‌వ బౌల‌ర్‌గా అశ్విన్ రికార్డుల‌కు ఎక్కాడు.