KL Rahul : టీ20 క్రికెట్ ఎంతో మారిపోయింది.. మ‌రింత క‌ష్ట‌ప‌డాల్సిందే..

ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండోసారి ఓడించింది.

LSG skipper KL Rahul : ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్‌ను ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ రెండోసారి ఓడించింది. మంగ‌ళ‌వారం చెపాక్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ సీజ‌న్‌లో ల‌క్నోకు ఇది ఐదో విజ‌యం. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టు ఖాతాలో 10 పాయింట్లు ఉన్నాయి. పాయింట్ల ప‌ట్టిక‌లో నాలుగో స్థానంలో కొన‌సాగుతూ ప్లే ఆఫ్స్ దిశ‌గా దూసుకుపోతుంది.

ఈ మ్యాచ్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 210 ప‌రుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (60 బంతుల్లో 108 నాటౌట్‌) అజేయ సెంచ‌రీతో చెల‌రేగాడు. అత‌డితో పాటు శివ‌మ్ దూబె (27 బంతుల్లో 66) మెరుపు అర్థ‌శ‌త‌కాన్ని సాధించాడు. అనంత‌రం ల‌క్ష్యాన్ని ల‌క్నో 19.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. మార్క‌స్ స్టొయినిస్ (63 బంతుల్లో 124 నాటౌట్‌), నికోల‌స్ పూర‌న్ (15 బంతుల్లో 34) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు.

Dhoni Review System : అంపైర్ వైడ్ ఇచ్చాడు.. త‌లా రివ్యూ తీసుకున్నాడు.. ట్రెండింగ్‌లో ధోని రివ్యూ సిస్ట‌మ్‌..

చెపాక్ మైదానంలో ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ఇది అత్య‌ధిక విజ‌య‌వంత‌మైన ఛేద‌న కావ‌డం విశేషం. అంత‌క‌ముందు 2020లో ఆర్‌సీబీ పై చెన్నై 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేదించింది.

కాగా.. సీఎస్‌కే పై విజ‌యం అనంత‌రం ల‌క్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ మాట్లాడాడు. లక్ష్య ఛేద‌న‌లో ఓ ద‌శ‌లో వెనుక‌బ‌డిన‌ట్లు అనిపించింద‌ని, అయితే.. ఆఖ‌రికి విజ‌యాన్ని సాధించ‌డం ఎంతో ఆనందంగా ఉంద‌ని చెప్పాడు. చెపాక్‌లో ప‌రిస్థితులు భిన్నంగా ఉంటాయి. చెన్నై జ‌ట్టు బ్యాటింగ్‌లో శుభారంభం చేసింది. మా బౌల‌ర్ల‌ను వారు ఒత్త‌డిలోకి నెట్టారు. ఈ పిచ్ పై 210 ప‌రుగులు చేయొచ్చున‌ని నేను భావించ‌డం లేదు. ఎంతో గొప్ప‌గా వాళ్లు బ్యాటింగ్ చేశార‌ని రాహుల్ అన్నాడు.

మా జ‌ట్టు విష‌యానికి వ‌స్తే.. మార్క‌స్ స్టొయినిస్‌కే మొత్తం క్రికెట్ ఇవ్వాలి. అత‌డి ఆట ఎంతో బాగుంది. అత‌డు ప‌వ‌ర్ హిట్టింగ్ మాత్ర‌మే చేయ‌లేదు. స్మార్ట్ బ్యాటింగ్ కూడా చేశాడు. వ‌న్‌డౌన్‌లో అత‌డిని పంపడానికి కార‌ణం ధైర్య‌వంతమైన జ‌ట్టుగా ఉండాల‌ని భావించాం. అంతేకాకుండా ప‌వ‌ర్ ప్లేను పూర్తిగా స‌ద్వినియోగం చేసుకోవాల‌ని భావించిన‌ట్లు తెలిపాడు. గ‌త కొన్ని మ్యాచుల్లో 170 ప‌రుగులు కూడా దాట‌లేక‌పోయామ‌ని, అందుక‌నే టాప్‌-3లో ఓ ప‌వ‌ర్ హిట్ట‌ర్ ఉండాల‌ని అనుకున్న‌ట్లు చెప్పాడు.

Marcus Stoinis : చ‌రిత్ర సృష్టించిన మార్క‌స్ స్టోయినిస్‌.. 13 ఏళ్ల నాటి రికార్డు బ‌ద్ద‌లు..

ప్ర‌స్తుతం టీ20 క్రికెట్ ఎంతో మారిపోయింది. 170-180 ప‌రుగులు అస్స‌లు స‌రిపోవ‌డం లేదు. ప‌వ‌ర్ ప్లేలో హిట్టింగ్ చేయాలి. ఇంపాక్ట్ ప్లేయ‌ర్ నిబంధ‌న కార‌ణంగా బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో డెప్త్ పెరుగుతుంది. దీంతో బ్యాట‌ర్లు ఎంతో స్వేచ్ఛ‌గా బ్యాటింగ్ చేస్తార‌న్నాడు.

ట్రెండింగ్ వార్తలు