Marcus Stoinis : చ‌రిత్ర సృష్టించిన మార్క‌స్ స్టోయినిస్‌.. 13 ఏళ్ల నాటి రికార్డు బ‌ద్ద‌లు..

ఐపీఎల్‌ 17వ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది.

Marcus Stoinis : చ‌రిత్ర సృష్టించిన మార్క‌స్ స్టోయినిస్‌.. 13 ఏళ్ల నాటి రికార్డు బ‌ద్ద‌లు..

pic credit @ ipl

Marcus Stoinis Creates History : ఐపీఎల్‌ 17వ సీజ‌న్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. మంగ‌ళ‌వారం చెపాక్ వేదిక‌గా చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. 211 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 19.3 ఓవ‌ర్ల‌లో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ల‌క్నో విజ‌యం సాధించ‌డంలో ఆ జ‌ట్టు ఆల్‌రౌండ‌ర్ మార్కస్ స్టోయినిస్ (124 నాటౌట్‌; 63 బంతుల్లో 13 ఫోర్లు, 6 సిక్స‌ర్లు) కీల‌క పాత్ర‌ పోషించాడు. ఈ క్ర‌మంలో స్టోయినిస్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

ఛేజింగ్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించాడు. ఈ క్ర‌మంలో 13 ఏళ్ల క్రితం నాటి రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. గ‌తంలో ఈ రికార్డు పాల్ వాల్తాటి పేరిట ఉండేది. కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ త‌రుపున 2011లో పాల్ వాల్తాటి చెన్నై సూప‌ర్ కింగ్స్ పైనే 120 ప‌రుగులు చేశాడు. వీరిద్ద‌రి త‌రువాత వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నాడు. 2011లో ఢిల్లీ డేర్ డెవిల్స్ త‌రుపున ఆడుతూ వీరేంద్రుడు డెక్క‌న్ ఛార్జ‌ర్స్ పై 119 ప‌రుగుల‌తో చెల‌రేగాడు.

Irfan Pathan : ఇంకా కొంద‌రు ముంబై ప్లేయ‌ర్లు రోహితే కెప్టెన్ అని భావిస్తున్నారు : ఇర్ఫాన్ ప‌ఠాన్

ఐపీఎల్ చ‌రిత్ర‌లో ఛేజింగ్‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్లు..

మార్క‌స్ స్టోయినిస్ (ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌) – 124 నాటౌట్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 2024లో
పాల్ వాల్తాటి (కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్ ) – 120 నాటౌట్ – చెన్నై సూప‌ర్ కింగ్స్ పై 2011లో
వీరేంద్ర సెహ్వాగ్ (ఢిల్లీ డేర్ డెవిల్స్‌) – 119 – డెక్క‌న్ ఛార్జ‌ర్స్ పై 2011లో
సంజూ శాంస‌న్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌) – 119 – పంజాబ్ కింగ్స్ పై 2021లో
షేన్ వాట్స‌న్ ( చెన్నై సూప‌ర్ కింగ్స్ ) -117 నాటౌట్ – స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ పై 2018లో

కాగా. ఎనిమిదేళ్ల క్రితం 2016లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున లీగ్‌లో అరంగేట్రం చేసిన స్టోయినిస్ కు ఐపీఎల్‌లో ఇది తొలి సెంచరీ.

Sourav Ganguly : గంగూలీ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లి 40 బంతులు ఆడితే.. ఓపెన‌ర్‌గా మాత్రం..

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. రుతురాజ్ గైక్వాడ్ (108 నాటౌట్ ; 60 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్స‌ర్లు) విధ్వంస‌క‌ర శ‌త‌కానికి తోడు శివ‌మ్ దూబె (66; 27 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స‌ర్లు) మెరుపులు తోడ‌వ‌డంతో మొద‌ట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 210 ప‌రుగులు చేసింది. అనంత‌రం మార్క‌స్ స్టోయినిస్ మెరుపు శ‌త‌కం సాధించ‌డంతో ల‌క్ష్యాన్ని ల‌క్నో 19.3 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.