Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ దూసుకుపోతుంది. కొత్త కోచ్ పాంటింగ్, కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ల నేతృత్వంతో ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (30 బంతుల్లో 44 పరుగులు) ఆయుష్ బదోని (33 బంతుల్లో 41 పరుగులు )లు రాణించారు. కెప్టెన్ రిషబ్ పంత్ (2), మిచెల్ మార్ష్ (0) లు విఫలం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. యాన్సెన్, చాహల్, మాక్స్‌వెల్, ఫెర్గూసన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
Shreyas Iyer-MS Dhoni : శ్రేయస్ అయ్యర్ అరుదైన ఘనత.. ఎంఎస్ ధోని కెప్టెన్సీ రికార్డ్ బ్రేక్..
ఆ తరువాత ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69), శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) లు దంచికొట్టడంతో లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
చక్కని క్యాచ్ అందుకున్న బాల్ బాయ్..
కాగా.. ఈ మ్యాచ్‌లో నేహాల్ వధేరా కొట్టిన ఓ సిక్స్‌ను బౌండరీ లైన్ ఆవల ఉన్న బాల్ బాయ్ చక్కగా ఒడిసిపట్టుకున్నాడు. పంజాబ్ డగౌట్‌లోని వారితో పాటు కోచ్ రికీ పాంటింగ్ అతడిని ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
The 6⃣🔥
The Catch 🤌Both approved by Ricky Ponting 😌
Updates ▶ https://t.co/j3IRkQFrAa #TATAIPL | #LSGvPBKS | @PunjabKingsIPL pic.twitter.com/XSuat7Wy1H
— IndianPremierLeague (@IPL) April 1, 2025
పంజాబ్ ఇన్నింగ్స్ 14వ ఓవర్‌లో ఇది చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను లక్నో బౌలర్ రవి బిష్ణోయ్ వేశాడు. ఈ ఓవర్‌లోని ఆఖరి బంతికి మిడ్ వికెట్ మీదుగా వధేరా సిక్స్ బాదాడు. బౌండరీ లైన్ ఆవల ఉన్న బాల్‌బాయ్ ఆ బంతిని క్యాచ్ పట్టుకున్నాడు. అతడు బంతిని అందుకున్న విధానం చూసి రికీపాంటింగ్‌తో పాటు పంజాబ్ డగౌట్‌లోని వారు చప్పట్లతో బాల్‌బాయ్‌ని అభినందించారు.