Shreyas Iyer-MS Dhoni : శ్రేయ‌స్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త‌.. ఎంఎస్ ధోని కెప్టెన్సీ రికార్డ్ బ్రేక్‌..

శ్రేయ‌స్ అయ్య‌ర్ కెప్టెన్‌గా ఓ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

Shreyas Iyer-MS Dhoni : శ్రేయ‌స్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త‌.. ఎంఎస్ ధోని కెప్టెన్సీ రికార్డ్ బ్రేక్‌..

Courtesy BCCI

Updated On : April 2, 2025 / 12:00 PM IST

ఐపీఎల్ 2025 సీజ‌న్‌లో పంజాబ్ కింగ్స్ అద‌ర‌గొడుతోంది. కొత్త కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ సార‌థ్యంలో వ‌రుస‌గా రెండో విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. మంగ‌ళ‌వారం ల‌క్నో వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్‌లో ల‌క్నో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 7 వికెట్లు కోల్పోయి 171 ప‌రుగులు చేసింది. ల‌క్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవ‌ర్ల‌లో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ అయ్య‌ర్ బ్యాట్‌తోనూ రాణించాడు. 30 బంతుల‌ను ఎదుర్కొన్న అత‌డు 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 52 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు.

LSG vs PBKS : ఓట‌మి బాధ‌లో ఉన్న ల‌క్నోకు షాక్‌.. పంజాబ్ పై వికెట్లు తీసిన ఏకైక బౌల‌ర్ పై బీసీసీఐ కొర‌డా..

ఈ మ్యాచ్‌లో పంజాబ్ గెల‌వ‌డంతో కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. కెప్టెన్‌గా అయ్య‌ర్‌కు ఇది వ‌రుస‌గా ఎనిమిదో విజ‌యం. ఈ సీజ‌న్‌లో పంజాబ్ త‌రుపున అయ్య‌ర్‌కు రెండు విజ‌యాలు కాగా, ఐపీఎల్ 2024 సీజ‌న్‌లో కేకేఆర్ త‌రుపున వ‌రుస‌గా 6 మ్యాచ్‌ల్లో గెలిచాడు. ఈ క్ర‌మంలో ఎంఎస్ ధోని రికార్డును బ్రేక్ చేయ‌డంతో పాటు షేన్ వార్న్ రికార్డును స‌మం చేశాడు అయ్య‌ర్‌.

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్య‌ధిక మ్యాచ్‌ల్లో వ‌రుస‌గా విజ‌యాలు సాధించిన రికార్డు గౌత‌మ్ గంభీర్ పేరిట ఉంది. గంభీర్ వ‌రుస‌గా 10 మ్యాచ్‌ల్లో జ‌ట్టును గెలిపించాడు. ఎంఎస్ ధోని 7 సార్లు త‌న జ‌ట్టును వ‌రుస మ్యాచ్‌ల్లో గెలిపించాడు.

LSG vs PBKS : పంత్‌కు సూప‌ర్ పంచ్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్‌.. ‘మా వేలం టెన్ష‌న్ తీరిపోయింది..’ అయ్య‌ర్ వీడియోని పోస్ట్ చేస్తూ..

ఐపీఎల్‌లో కెప్టెన్‌గా అత్యధిక వరుస విజయాలు సాధించింది వీరే..

గౌతమ్ గంభీర్ – 10 విజ‌యాలు (2014-15లో కోల్‌కతా నైట్ రైడర్స్)
షేన్ వార్న్ – 8 విజ‌యాలు (2008లో రాజస్థాన్ రాయల్స్)
శ్రేయాస్ అయ్యర్ – 8 విజ‌యాలు (2024-25లో కోల్‌కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్)
ఎంఎస్ ధోని – 7 విజ‌యాలు (2013లో చెన్నై సూపర్ కింగ్స్)
గౌతమ్ గంభీర్ – 6 విజ‌యాలు (2012లో కోల్‌కతా నైట్ రైడర్స్)
ఎంఎస్ ధోని – 6 విజ‌యాలు (2014లో చెన్నై సూపర్ కింగ్స్)

LSG vs PBKS : పంజాబ్ పై ఓట‌మి.. పంత్‌కు వేలు చూపిస్తూ ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గొయెంకా సీరియ‌స్ డిస్క‌ష‌న్‌..

కేన్ విలియమ్సన్ – 6 విజ‌యాలు (2018లో సన్‌రైజర్స్ హైదరాబాద్)
ఎంఎస్ ధోని – 6 విజ‌యాలు (2019లో చెన్నై సూపర్ కింగ్స్)
ఫాఫ్ డు ప్లెసిస్ – 6 విజ‌యాలు (2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు)