LSG vs PBKS : పంత్‌కు సూపర్ పంచ్ ఇచ్చిన పంజాబ్ కింగ్స్.. ‘మా వేలం టెన్షన్ తీరిపోయింది..’ అయ్యర్ వీడియోని పోస్ట్ చేస్తూ..
లక్నో పై విజయం సాధించిన తరువాత గతంలో పంత్ మాట్లాడిన మాటలకు పంజాబ్ కింగ్స్ గట్టి కౌంటర్ ఇచ్చింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో పంజాబ్ విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మెరుపు హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.
కాగా.. తమ జట్టు విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో పంజాబ్ కింగ్స్ ఆలస్యం చేయలేదు. గతంలో లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడిన మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇస్తూ అయ్యర్ వీడియోను పోస్ట్ చేసింది.
𝐓𝐞𝐧𝐬𝐢𝐨𝐧 toh auction mein hi khatam ho gayi thi! 😉 pic.twitter.com/TnWcg5MxdM
— Punjab Kings (@PunjabKingsIPL) April 1, 2025
ఐపీఎల్ మెగా వేలం 2025లో మొదట శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ కింగ్స్ రూ.26.75 కోట్లకు కొనుగోలు చేసింది. కొద్ది సేపటికే రిషబ్ పంత్ ను రూ.27 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు.
కాగా.. లక్నో కెప్టెన్‌గా రిషబ్ ను ప్రకటించిన సమయంలో పంత్ మాట్లాడుతూ.. వేలంలో పంజాబ్ తనను ఎక్కడ సొంతం చేసుకుంటుందోనని టెన్షన్ పడ్డానని అన్నాడు. ఆఖరికి లక్నో జట్టు తీసుకోవడంతో ఉపశమనం పొందినట్లుగా చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. పంజాబ్ ఇన్‌డైరెక్ట్‌గా పంత్‌కు కౌంటర్ ఇచ్చింది. శ్రేయస్ అయ్యర్ వీడియోను పోస్ట్ చేస్తూ ‘మా వేలం టెన్షన్ ఇప్పుడు ముగిసింది.’ అంటూ రాసుకొచ్చింది.
వేలంలో పంత్ కోసం కూడా పంజాబ్ గట్టిగానే ప్రయత్నించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో కాకుండా బ్యాటర్‌గా అదరగొడుతూ పంజాబ్‌కు వరుసగా రెండో విజయాన్ని అందించాడు. అటు పంత్ మాత్రం కెప్టెన్‌గానే కాక బ్యాటర్‌గానూ ఘోరంగా విఫలం అవుతున్నాడు. పంత్ సారథ్యంలో లక్నో ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడగా రెండింటిలో ఓడిపోయింది.