LSG vs PBKS : ఓటమి బాధలో ఉన్న లక్నోకు షాక్.. పంజాబ్ పై వికెట్లు తీసిన ఏకైక బౌలర్ పై బీసీసీఐ కొరడా..
ఓటమి భాదలో ఉన్న లక్నోకు మరో షాక్ తగిలింది.

Courtesy BCCI
ఐపీఎల్ 2025 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మరో ఓటమి ఎదురైంది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. అసలే ఓటమి భాదలో ఉన్న లక్నోకు మరో షాక్ తగిలింది.
లక్నో స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రతి పై బీసీసీఐ చర్యలు తీసుకుంది. అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానాగా విధించింది. అంతేకాదు అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను చేర్చింది.
అసలేం జరిగిందంటే..?
పంజాబ్ కింగ్స్ లక్ష్య ఛేదనకు బరిలోకి దిగగా.. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌ను దిగ్వేష్ వేశాడు. ఈ ఓవర్‌లోని తొలి బంతిని పంజాబ్ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (8) బౌండరీకి తరలించాడు. రెండో బంతికి షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి గాల్లోకి లేచింది. మిచెల్ మార్ష్ క్యాచ్‌ను మిస్ చేశాడు. ఇదే ఓవర్‌లోని ఐదో బంతికి ఆర్య పుల్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. మిస్‌టైమ్ కావడంతో బంతి గాల్లోకి లేచింది.
Ekana mein pehli wicket – Check ✅pic.twitter.com/nrAf1pWf7W
— Lucknow Super Giants (@LucknowIPL) April 1, 2025
మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న శార్దూల్ ఠాకూర్ పరిగెత్తుకుంటూ వచ్చి సింపుల్‌గా క్యాచ్‌ను అందుకున్నాడు. దీంతో ఆర్య నిరాశగా పెవిలియన్ వైపుకు నడుచుకుంటూ వెలుతున్నాడు. అయితే.. దిగ్వేష్ పరిగెత్తుకుంటూ ఆర్య వద్దకు వెళ్లి.. నోటుబక్‌లో రాసుకుంటున్నట్లుగా సంబరాలు చేసుకున్నాడు. దిగ్వేష్ చేసిన పనికి అప్పుడే ఫీల్డ్ అంపైర్ అతడిని మందలించాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నెటిజన్లు కూడా దిగ్వేష్ తీరును తప్పుబడుతున్నారు.
కాగా.. దిగ్వేష్ చేసిన పని పై ఐపీఎల్ నిర్వాహకులు మండిపడ్డారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో అతడి మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించినట్లు తెలిపారు. అంతేకాదండోయ్ అతడి ఖాతాలో ఓ డీమెరిట్ పాయింట్‌ను సైతం చేర్చారు. దిగ్వేష్ తాను చేసిన తప్పును ఒప్పుకున్నట్లుగా పేర్కొన్నారు.
🚨 DIGVESH RATHI FINED 25% OF HIS MATCH FEES AND HANDED 1 DEMERIT POINT FOR CELEBRATING. 🚨 pic.twitter.com/ofmJlsedmM
— Mufaddal Vohra (@mufaddal_vohra) April 2, 2025
మ్యాచ్ విషయానికి వస్తే. ఈ మ్యాచ్‌లో లక్నో మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. అనంతరం ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69), శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) లు దంచికొట్టడంతో లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది. కాగా.. పంజాబ్ కోల్పోయిన రెండు వికెట్లను దిగ్వేష్ తీయడం గమనార్హం.