Mark Wood to miss final stages of IPL
IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)2023 సీజన్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా ఆడుతోంది. ఇప్పటి వరకు లక్నో జట్టు 7 మ్యాచులు ఆడగా నాలుగు మ్యాచుల్లో విజయం సాధించి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. అయితే.. లక్నో జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగలనుంది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఆ జట్టు తరుపున అత్యధిక వికెట్లు తీసిన వీరుడిగా ఉన్నఫాస్ట్ బౌలర్ మార్క్‌వుడ్ కీలక సమయంలో జట్టును వీడి వెళ్లనున్నాడు.
IPL 2023, LSG vs GT: చేజేతులా ఓడిపోయిన లక్నో.. స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న గుజరాత్
మార్క్ వుడ్ భార్య సారా మే నెలాఖరులో రెండో బిడ్డకు జన్మనివ్వనుంది. దీంతో ప్రస్తుతం భార్య పక్కన ఉండాలని మార్క్‌వుడ్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో వీలైనంత త్వరగా స్వదేశానికి వెళ్లేందుకు మార్క్‌వుడ్ ఏర్పాట్లు చేసుకుంటున్నాడు. దీంతో కీలక సమయంలో అతడి సేవలను లక్నో జట్టు కోల్పోనుంది. ఇది ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఈ సీజన్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన వుడ్ 11 వికెట్లు తీశాడు. అనారోగ్యం కారణంగా చివరి రెండు మ్యాచుల్లో ఆడలేదు.
IPL 2023, GT vs MI: హార్ధిక్ సేనను ముంబై అడ్డుకునేనా..?
లక్నో ప్లే ఆఫ్ బెర్తు ఇంకా ఖరారు కాలేదు. ఇలాంటి సమయంలో గనుక వుడ్ దూరం అయితే లక్నో బౌలింగ్ విభాగం బలహీన పడడం ఖాయం. వుడ్ గైర్హాజరీలో ఆఫ్ఘనిస్తాన్ సీమర్ నవీన్ ఉల్ హక్ గత రెండు మ్యాచుల్లో ఆడాడు. తన బౌలింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. లక్నో సూపర్ జెయింట్ శుక్రవారం (ఏప్రిల్ 28) తన తదుపరి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ తరువాత వుడ్ ఇంగ్లాండ్‌కు వెళ్లే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మే 1, చెన్నై సూపర్ కింగ్స్ తో మే 3న సొంత మైదానంలో ఆడనుంది. వుడ్ స్థానంలో లక్నో ఎవరిని ఎంచుకుంటుందో చూడాలి.